ఇక అక్కడ భారీ బడ్జెట్ సినిమాలు కష్టమే
తెలుగు రాష్ట్రాల్లో పక్కన పెడితే సైరా చిత్రం కలెక్షన్స్ ఓవర్సీస్లో డల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ అక్కడ ఆదివారంతో రెండున్నర మిలియన్లు సాధించిన తొలి చిరంజీవి [more]
తెలుగు రాష్ట్రాల్లో పక్కన పెడితే సైరా చిత్రం కలెక్షన్స్ ఓవర్సీస్లో డల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ అక్కడ ఆదివారంతో రెండున్నర మిలియన్లు సాధించిన తొలి చిరంజీవి [more]
తెలుగు రాష్ట్రాల్లో పక్కన పెడితే సైరా చిత్రం కలెక్షన్స్ ఓవర్సీస్లో డల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ అక్కడ ఆదివారంతో రెండున్నర మిలియన్లు సాధించిన తొలి చిరంజీవి సినిమాగా సైరా రికార్డులకి ఎక్కనుంది. కానీ ఈ మూవీ ఇంకా సేఫ్ జోన్ కి వెళ్లాలంటే ఇంకో హాఫ్ మిలియన్ రావాల్సిఉంది. కానీ ఆ హాఫ్ మిలియన్ కూడా కష్టమే అని అర్ధం అవుతుంది. సెకండ్ వీక్ లో పెద్దగా సినిమాలు ఏమి లేనప్పటికీ ఈ మూవీ పుంజుకోలేకపోయింది.
బయ్యర్లలో గుబులు …
సినిమాకి మంచి రేటింగ్స్, టాక్ వచ్చినా కూడా మూడు మిలియన్లు రీచ్ అవలేకపోవడంతో ఓవర్సీస్ బయ్యర్లలో గుబులు మొదలయింది. గతంలో సాహోకి వచ్చినట్టుగా ఇతర భాషల నుంచి సైరాకి ఎలాంటి బెనిఫిట్ జరగలేదు. సో ఫ్యూచర్ లో పెద్ద సినిమాలపై ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదని ఓ ఆలోచనకు వచ్చేశారు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్. అక్కడ సినిమాలకి సంబంధించి యేవో ఆఫర్స్ ఉంటాయి. అవి ప్రస్తుతం లేకపోవడంతో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందని చెబుతున్నారు.