శాటిలైట్ కి భారీ ధర వచ్చినా... లాభం లేదు!
బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమా యావరేజ్ టాక్ తో యావరేజ్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. హీరో కెపాసిటీ చూడకుండా నిర్మతలు భారీగా పెట్టుబడులు పెట్టడం టాక్ బావున్నా వసూళ్లు వచ్చినా పెట్టిన పెట్టుబడికి సరిపడా రాకపోవడం ఆ సినిమా ఫ్లాప్ లిస్ట్ లోకెళ్లిపోతుంది. గత ఏడాది లై, నేనే రాజు నేనే మంత్రి సినిమాలకు పోటీగా బోయపాటి, బెల్లంకొండ శ్రీనివాస్ లు తమ జయ జానకి నాయక సినిమాని దింపారు. ఆ సినిమాకి టాక్ బావున్నా కలెక్షన్స్ లేవు. పోటీపడిన మూడు సినిమాల్లో నేనే రాజు నేనే మంత్రి కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది. అదే జయజనకి నాయక గనక సోలోగా దిగుంటే మంచి కలెక్షన్స్ తో సినిమా హిట్ అయ్యేది. ఇక సాక్ష్యం సినిమా కూడా ఏ 30 కోట్లతోనో తెరకెక్కితే ఆ సినిమా కూడా హిట్ అయ్యిండేది. కానీ ఈ సినిమా ఏకంగా 42 కోట్ల పెట్టుబడి పెట్టేసారు. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా కేవలం 3.5 కోట్ల షేర్ తెచ్చిన సాక్ష్యం ఈ వీకెండ్ లో అయితే మరో ఐదు కోట్లేసుకున్నా మొత్తం 8 కోట్ల మాత్రమే కొల్లగొట్టింది.
కొంత ఊరట కలిగించిన శాటిలైట్ రైట్స్
ఇక కొంతలో కొంత కాదు గాని సాక్ష్యం నిర్మాతలకు సాక్ష్యం శాటిలైట్ హక్కులతోనే కాస్త ఊరట కలిగింది. సాక్ష్యం సినిమా హిందీ రైట్స్ ఏకంగా 8 కోట్లు పలకగా... తెలుగు శాటిలైట్ రైట్స్ 5 కోట్లు పలకడం కష్టాల్లో కాస్త నిర్మాతల పాలిట వరమే. లేదంటే సాక్ష్యం నిర్మాతలు భారీగానే నష్టపోయేవారు. మరి మరో వారం ఛాన్స్ ఉన్నా... సాక్ష్యం సినిమాకి పెట్టిన పెట్టుబడి దగ్గర దగ్గరకి వచ్చేది. కానీ వచ్చే వారం మీడియం బడ్జెట్ తో తెరకెక్కిన చి ల సౌతో పాటు బ్రాండ్ బాబు సినిమాలు విడుదల కోబోతున్నాయి. మరి రెండు సినిమాలకు కాస్త క్రేజ్ ఉంది. మరి ఆ రెండింటిలో ఏది పాజిటివ్ టాక్ వచ్చిన సాక్ష్యం బిచానా ఎత్తెయ్యాల్సిందే.
ఇంకా 20 కోట్లు వసూలు చేస్తేనే..
ఇక ఎలా లేదన్నా సాక్ష్యం సినిమా కేవలం ఈ నాలుగు రోజుల్లోనే వసూళ్లు కొల్లగొట్టాలి. మరి ఇప్పటికే వరల్డ్ వైడ్ గా ఏడు నుండి ఎనిమిది కోట్ల షేర్ రాబడుతున్న ఈ సినిమా శాటిలైట్ హక్కుల రూపంలో 13 కోట్లు రాబట్టింది. ఇక మొత్తంగా చూస్తే కేవలం 20 కోట్లు సాక్ష్యం సినిమాకి ఇప్పటివరకు వచ్చాయి. మరి మిగతా 20 కోట్లు రావాలంటే సాక్ష్యం సినిమాకి సాధ్యమవుతుందా. అందుకే ఈ సినిమాని ఫైనల్ గా ఫ్లాప్ గానే డిక్లర్ చేసేలా వున్నారు. తాజాగా సాక్ష్యం సినిమాకి ప్రమోషన్స్ చేసినా లభమైతే కనబడడం లేదు.