Mon Dec 23 2024 13:22:30 GMT+0000 (Coordinated Universal Time)
Sriya Reddy : సలార్ నటి ఆ భారత క్రికెటర్ కూతురు అని తెలుసా..?
సలార్ నటి ఆ భారత క్రికెటర్ కూతురు, తమిళ స్టార్ హీరో విశాల్ కి బంధువు అని మీకు తెలుసా..? ఆమె గురించిన పూర్తి విషయాలన్ని ఈ ఆర్టికల్ చదివేసి తెలుసుకోండి.
Sriya Reddy : తమిళ నటి శ్రియారెడ్డి.. ప్రభాస్ సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ సోదరిగా రాధారమ అనే ఓ ముఖ్య పాత్రని పోషించారు. ఈ సినిమాలో ఈమె పాత్ర ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీంతో ప్రస్తుతం శ్రియారెడ్డి పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. ఇక కొంతమంది ఆడియన్స్ అసలు ఈ నటి ఎవరు..? అంతకుముందు ఏం సినిమాలు చేసింది..? అని చెక్ చేస్తున్నారు. అయితే ఈ నటి ఒకప్పటి భారత క్రికెటర్ కూతురు అని మీకు తెలుసా..? అంతేకాదు తమిళ స్టార్ హీరో విశాల్ కి కూడా ఈమె బంధువే. ఆమె గురించిన పూర్తి విషయాలన్ని ఈ ఆర్టికల్ చదివేసి తెలుసుకోండి.
1978-1981 మధ్య పలు అంతర్జాతీయ స్థాయిలో భారత టీంతో కలిసి మ్యాచ్లు ఆడిన 'భరత్ రెడ్డి' కూతురే.. ఈ శ్రియారెడ్డి. ప్రస్తుతం భారత టీంలో టెస్ట్ క్రికెటర్స్ గా రాణిస్తున్న దినేష్ కార్తీక్, లక్ష్మీపతి బాలాజీలకు భరత్ రెడ్డే శిక్షణ ఇచ్చారు. తెలుగు కుటుంబం అయిన వీరు చెన్నైలోనే సెటిల్ అయ్యారు. శ్రియారెడ్డి చదువుకుంటున్న సమయంలోనే 'సథరన్ స్పైస్ మ్యూజిక్'లో వీజేగా పని చేస్తూ వచ్చారు. ఇక అక్కడే వీజేగా చేస్తున్న విక్రమ్ కృష్ణతో ఆమెకు స్నేహం మొదలైంది. ఈ విక్రమ్ కృష్ణ మరెవరో కాదు.. తమిళ స్టార్ హీరో విశాల్ అన్నయ్య. విశాల్ కంటే ముందు విక్రమ్ కృష్ణ హీరోగా ఆడియన్స్ కి పరిచయం అయ్యారు.
అయితే హీరోగా కొన్ని సినిమాల్లోనే నటించి, నిర్మాణం వైపు టర్న్ తీసుకున్నారు. ఇక కెరీర్ స్టార్టింగ్ లో వీజేగా చేస్తున్న సమయంలో శ్రియారెడ్డితో ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారడంతో 2008లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి.. ఇద్దరు అమెరికాలో సెటిల్ అయ్యారు. అయితే గత ఏడాది మళ్ళీ చెన్నై తిరిగి వచ్చిన శ్రియారెడ్డి.. మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నారు.
శ్రియారెడ్డి తెలుగు సినిమా 'అప్పుడప్పుడు'తోనే పూర్తిస్థాయి నటిగా కెరీర్ స్టార్ట్ చేశారు. శర్వానంద్ 'అమ్మ చెప్పింది' సినిమాలో కూడా ముఖ్య పాత్ర చేశారు. అయితే విశాల్ హీరోగా తెరకెక్కిన 'పొగరు' సినిమాలో నెగటివ్ షెడ్ పాత్రతోనే శ్రియారెడ్డి.. అటు తమిళంలో ఇటు తెలుగులో నటిగా మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ నటి.. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్లో వచ్చిన 'సుడల్' వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చారు.
ఈ సిరీస్ తో మూవీ మేకర్స్ దృష్టిని ఆకర్షించారు. దీంతో వరుసపెట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ క్యూ కట్టాయి. ప్రభాస్ 'సలార్', పవన్ కళ్యాణ్ 'OG' మూవీల్లో ముఖ్య పాత్రలు చేసే అవకాశం అందుకున్నారు. మూవీ మేకర్స్ కూడా పవర్ ఫుల్ లేడీ రోల్స్ కి శ్రియారెడ్డి బెస్ట్ ఛాయస్ గా కనిపిస్తున్నారు. మరి ఫ్యూచర్ ఇంకెన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని అందుకుంటారో చూడాలి.
Next Story