Mon Dec 23 2024 10:50:59 GMT+0000 (Coordinated Universal Time)
సేల్స్ గర్ల్‌గా చేయాలని ఉండేది.. శృతిహాసన్!
శృతిహాసన్ ప్రస్తుతం డూడుల్ ఆర్టిస్ట్ 'శంతను హజారికా'తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా శృతి తనతో..
లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన శృతిహాసన్ (Shruti Haasan) తండ్రికి లాగానే మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంది. హీరోయిన్గా, పాప్ సింగర్‌గా, డాన్సర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కాగా శృతిహాసన్ చాలా ఓపెన్ గా ఉంటుంది. ఏ విషయం అయినా అసలు దాచుకోకుండా మాట్లాడేస్తుంది. తాజాగా తన ప్రేమ ఎలా పుట్టింది..? ఎక్కడ పుట్టింది..? అనే దాని గురించి తెలియజేసింది.
శృతిహాసన్ ప్రస్తుతం డూడుల్ ఆర్టిస్ట్ 'శంతను హజారికా'తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా శృతి తన ఇన్‌స్టా ద్వారా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యింది. ఇక ఈ ఇంటరాక్షన్ లో శంతనుతో ప్రేమ పరిచయం గురించిన ప్రశ్న ఎదురైంది. దానికి శృతిహాసన్ బదులిస్తూ.. "శంతను ఆర్ట్ వర్క్ నాకెంతో నచ్చింది. దీంతో తనని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. ఆ తరువాత తను కూడా ఫాలో అయ్యాడు. నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అలా మా పరిచయం స్టార్ట్ అయ్యి, ఇన్‌స్టాగ్రామ్‌లోనే ప్రేమ వరకు చేరుకుంది" అంటూ వెల్లడించింది.
ఇక ఇద్దరిలో ఎవరు ముందు లవ్ ప్రొపోజల్ పెట్టారు అనే ప్రశ్న గతంలో ఎదురైనప్పుడు.. తానే ముందుగా లవ్ ప్రొపోజ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే పెళ్లి గురించి అడిగితే మాత్రం.. 'బోరింగ్' అంటూ బదులిచ్చింది. ఇక ఇదే ఇంటరాక్షన్ లో ఒక నెటిజెన్ ప్రశ్నిస్తూ.. 'చిన్నప్పుడు ఏ జాబ్ చేయాలని అనుకున్నారు' అని ప్రశ్నించాడు. దీనికి శృతిహాసన్ ఇచ్చిన సమాధానం వింటే దిమ్మతిరుగుతుంది.
చిన్నతనంలో తనకి బట్టల షాప్ లో సేల్స్ గర్ల్ గా జాబ్ చేయాలనే కోరిక ఉండేదట. అక్కడికి వచ్చిన కస్టమర్లతో ముచ్చటలు పెడుతుంటే చాలా సరదాగా ఉండేదని, అందుకనే ఆ జాబ్ చేయాలని అనిపించేదట. చిన్నతనంలో తన ఆలోచనలు అన్ని కూడా ఇలానే ఉండేవి అంటూ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఇక అలాగే తనకి టాటూలు అంటే చాలా ఇష్టమని, ఒకవేళ యాక్ట్రెస్ కాకుంటే బాడీ మొత్తం టాటూలు వేయించుకునేదట.
Next Story