Mon Dec 23 2024 11:14:49 GMT+0000 (Coordinated Universal Time)
సర్జరీ సక్సెస్.. ఇండియా తిరిగి రాబోతున్న ప్రభాస్..
శస్త్ర చికిత్స కోసం యూరప్ వెళ్లిన ప్రభాస్.. ఇండియా తిరిగి రాబోతున్నాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ గత కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్య మరి ఎక్కువ అవ్వడంతో ఇటీవల శస్త్ర చికిత్స కోసం యూరప్ వెళ్లాడు. గత నెలలోనే ఈ సర్జరీ పూర్తి అయ్యింది. అయితే కంప్లీట్ రెస్ట్ కావల్సి ఉండడంతో.. నెల రోజుల నుంచి అక్కడే రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రభాస్ పూర్తిగా కోలుకున్నాడట. దీంతో ఇండియాకి రిటర్న్ అవుతున్నాడు. ఇంతకీ అసలు ప్రభాస్ మోకాలికి గాయం ఎప్పుడు జరిగింది..?
బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ ఈ మోకాలి సమస్యని ఎదుర్కొన్నాడు. బాహుబలి యాక్షన్ సీన్స్ కోసం ప్రభాస్ నెలలు తరబడి కష్టపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ప్రభాస్ ఈ సమస్యని ఎదుర్కొన్నాడు. అయితే తాత్కాలిక చికిత్స తీసుకోని ప్రభాస్ షూటింగ్ లో పాల్గొంటూనే వచ్చాడు. సలార్, ఆదిపురుష్ సినిమా సమయంలో మోకాలి నొప్పితోనే షూటింగ్ పూర్తి చేశాడు. ఆదిపురుష్ ప్రమోషన్స్ సమయంలో ప్రభాస్ సరిగ్గా నడవలేక ఇబ్బంది పడిన సందర్భాలు అందరూ చూసినవే.
ఇక ఈ మధ్య ఆ నొప్పి మరింత తీవ్రతరం అవ్వడంతో ప్రభాస్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. సలార్ రిలీజ్ కూడా పోస్టుపోన్ అవ్వడం, ప్రమోషన్స్ కి సమయం ఉండడంతో.. కల్కి, మారుతీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి చికిత్స కోసం యూరప్ వెళ్లాడు. అక్కడ సక్సెస్ఫుల్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్.. నవంబర్ 6న హైదరాబాద్ తిరిగి రాబోతున్నాడట. ఇక వచ్చిన వెంటనే సలార్ ప్రమోషన్స్ గురించి ప్లాన్ చేస్తాడట.
ప్రమోషన్స్ షెడ్యూల్ మొత్తం సెట్ చేసుకొని, మారుతీ సినిమా కొత్త షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేయనున్నాడని సమాచారం. రెండు భాగాలుగా తెరకెక్కిన సలార్ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజుకి మూవీ నుంచి టీజర్ లేదా ట్రైలర్ వస్తుంది అనుకుంటే.. ఏమి ఇవ్వక ఫ్యాన్స్ ని నిరాశపరిచారు మేకర్స్. ఈ దీపావళికి అయినా ఏమన్నా అప్డేట్ ఇస్తారా అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.
Next Story