Mon Dec 23 2024 07:11:12 GMT+0000 (Coordinated Universal Time)
నిజంగా బాక్సాఫీసు డైనోసార్
ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్: పార్ట్ 1 - సీజ్ఫైర్’ సినిమా విడుదలకు
ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్: పార్ట్ 1 - సీజ్ఫైర్’ సినిమా విడుదలకు ముందే భారీ కలెక్షన్స్ సాధించడం మొదలుపెట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విడుదలవుతున్న అన్ని చోట్లా తొలిరోజు టికెట్లు ఖాళీ అయిపోయాయి. పీవీఆర్, ఐనాక్స్, మిరాజ్ మల్టీప్లెక్స్ చైన్స్‌లో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. అవి కూడా నిండిపోయాయి. తొలిరోజు భారతదేశంలోనే 30 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. విదేశాల్లో కూడా సలార్ కు భారీ క్రేజ్ ఉంది. అమెరికాలో ‘సలార్’ ప్రీమియర్స్‌కు రికార్డు స్థాయిలో బుకింగ్స్ అవుతూ ఉన్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పటికే 2 మిలియన్ డాలర్లు (గ్రాస్) దాటిపోయింది.
ఇక ఎగ్జిబిటర్లు ప్రభాస్ సలార్ కంటే షారూఖ్ ఖాన్ సినిమా డంకీ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం సాగింది. దీని కారణంగా హోంబలే ఫిల్మ్స్ తమ చిత్రాన్ని కొన్ని రాష్ట్రాల్లోని పివిఆర్-ఐనాక్స్, మిరాజ్ థియేటర్లలో విడుదల చేయకూడదని నిర్ణయించుకుందని కొందరు తెలిపారు. అలాంటిదేమీ లేదని సలార్ ఇప్పుడు PVR ఐనాక్స్ స్క్రీన్లలో ప్రదర్శించనున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ పివిఆర్-ఐనాక్స్‌లో కూడా మొదలయ్యాయి. జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదంటూ PVR ఐనాక్స్ బృందం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. భారతదేశం అంతటా బుకింగ్ ప్రారంభించినట్లు స్పష్టం చేశారు.
Next Story