Mon Dec 23 2024 06:25:38 GMT+0000 (Coordinated Universal Time)
సలార్ సినిమా టికెట్లు వచ్చేశాయ్.. కానీ!!
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్-పార్ట్ 1 సినిమా టికెట్లు వచ్చేశాయి
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్-పార్ట్ 1 సినిమా టికెట్లు వచ్చేశాయి. ప్రస్తుతం బెంగళూరు లోని పలు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు సంబంధించిన టికెట్స్ పలు టికెట్ బుకింగ్ యాప్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం 5 గంటల షోలకు సంబంధించి సలార్ సినిమా టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా మల్టీప్లెక్స్ కు సంబంధించిన టికెట్లు విడుదల చేయాల్సి ఉంది.
తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా టికెట్స్, షో టైమింగ్స్ కు సంబంధించి ఇలా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అడ్వాన్స్ బుకింగ్‌ల ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్‌లోని ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి మేకర్స్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ తెరవలేదని తెలుసుకున్న తర్వాత నిరాశ చెందారు. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌లను డిసెంబర్ 15న ప్రారంభించాల్సి ఉండగా.. ఇంకా జరగకపోవడంతో అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని అభిమానులు టిక్కెట్ల కోసం బుక్‌మైషో, పేటీఎం వంటి ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ సైట్లను నిరంతరం తనిఖీ చేస్తూనే ఉన్నారు. కర్ణాటక, కేరళలో ఈ సినిమా బుకింగ్‌లు డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం 6:49 గంటలకు ప్రారంభమయ్యాయి, కానీ పరిమిత స్క్రీన్లలో మాత్రమే. వీలైనంత త్వరగా హైదరాబాద్ నగరంలో టిక్కెట్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభాస్ అభిమానులు అభ్యర్థిస్తున్నారు. ‘సలార్: సీజ్ ఫైర్ – పార్ట్ 1’ డిసెంబర్ 22న ఐదు భాషల్లో విడుదల కానుంది.
Next Story