Sat Dec 21 2024 02:09:58 GMT+0000 (Coordinated Universal Time)
1 నిమిషం 23 సెకన్ల రన్‌టైమ్ లో ఎవరు రాబోతున్నారు?
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22న
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22న హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్‌ని బట్టి చూస్తే సినిమాలో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయి. అందుకే సెన్సార్ సర్టిఫికేట్ కోసం సాలార్ మేకర్స్ యాక్షన్ సీన్స్ విషయంలో రాజీ పడలేదు. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో రూపొందించాడు. పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ తో కేజీఎఫ్ డైరక్టర్ చేసిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.
ఈ సినిమా విషయంలో ఊహించని నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్.. సలార్ మేకర్స్ సినిమా రన్‌టైమ్‌ని పొడిగించారు. సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, దర్శక నిర్మాతలు అందరినీ ఆశ్చర్యపరిచేలా రన్‌టైమ్‌ని పొడిగించారు. సాలార్ చిత్రం 175 నిమిషాల 11 సెకన్ల రన్టైమ్తో సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డ్ నుండి ఈ చిత్రానికి A సర్టిఫికేట్ లభించింది. తాజాగా సలార్ బృందం అదనంగా 1 నిమిషం 23 సెకన్ల రన్‌టైమ్‌ని పొందడానికి మళ్లీ సెన్సార్‌కి వెళ్లింది. ఇది పోస్ట్ క్రెడిట్ సన్నివేశంగా చెబుతున్నారు. ఇప్పుడు, సలార్ రన్‌టైమ్ 176:44 నిమిషాలు. ఆ కొత్తగా యాడ్ చేసిన 1 నిమిషం 23 సెకన్ల రన్‌టైమ్ లో ఏ కంటెంట్ ఉండబోతోందోనని సినిమా లవర్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.
Next Story