Sat Dec 21 2024 05:09:06 GMT+0000 (Coordinated Universal Time)
మొన్న అలా.. నేడు ఇలా.. ప్రభాస్‌కే ఎందుకిలా..?
పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ విషయంలో జరిగే వాటి గురించి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా వైడ్ అభిమానులను సంపాదించుకొని దేశంలోనే పెద్ద స్టార్ గా ఎదిగాడు. అయినాసరి చాలా సింపుల్ గా ఉంటూ తన పని ఏంటో తను చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. కాగా ఇతర హీరోలు తమ ఫేమ్ ని మరింత పెంచుకోవడానికి సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ కి చాలా దగ్గర ఉంటుంటారు. ఇక ట్విట్టర్ అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలోని ప్రతి సెలబ్రిటీకి నిత్యావసర మాధ్యమం అయ్యిపోయింది.
ఎందుకంటే సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ ఇవ్వాలన్నా.. ట్విట్టరే వేదిక అవుతుంది. దీంతో స్టార్ హీరోలు సైతం ట్విట్టర్ లో తప్పక అకౌంట్స్ మెయిన్టైన్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటికీ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయలేదు. పేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే ప్రభాస్ కి అకౌంట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు అవి కూడా లేకుండా పోయాయి. ఈ ఏడాది జులైలో ప్రభాస్ పేస్ బుక్ హ్యాక్ అయ్యింది.
అది జరిగి మూడు నెలలు పూర్తి అయ్యాయో లేదో.. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా పోయినట్లు తెలుస్తుంది. ప్రభాస్ ఇన్‌స్టా అకౌంట్ ఈరోజు ఉదయం నుంచి కనిపించడం లేదు. ప్రభాస్ ఇన్‌స్టా పేజీ అందుబాటులో లేదని చూపిస్తుంది. ఈ అకౌంట్ హ్యాకింగ్‌కి గురైందా..? లేదా డి యాక్టివేట్ చేసేశారా..? అనేది తెలియడం లేదు. ఇక ప్రభాస్ తో కాంటాక్ట్ లో ఉండడానికి ఉన్న ఒకే ఒక్క ప్లాట్ఫార్మ్ కూడా కనిపించకుండా పోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మొన్న పేస్ బుక్ అలా, నేడు ఇన్‌స్టా ఇలా, ప్రభాస్ విషయంలోనే ఎందుకిలా జరుగుతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ సినిమాల విషయంలో తప్పులు జరిగి, సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్ చేయడంలో కూడా తప్పులు జరుగుతుంటే.. ప్రభాస్ టీం ఏం చేస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఇన్స్టాగ్రామ్ కనిపించకపోవడం వెనుక ఉన్న కారణం గురించి.. ప్రభాస్ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Next Story