Mon Dec 23 2024 16:38:09 GMT+0000 (Coordinated Universal Time)
Prabhas : రెబల్ ఫ్యాన్స్ని ఫుల్ ఖుషీ చేస్తున్న ప్రభాస్ మాస్ పిక్..
బాహుబలి నుంచి మిస్ అయిన ప్రభాస్ ని మళ్ళీ ఇప్పుడు చూసిన ఫ్యాన్స్. వైరల్ అవుతున్న ఫోటో.
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్.. తన హైట్తో, అందంతో అమ్మాయిల మనసులను మాత్రమే కాదు అబ్బాయిలకు కూడా రోల్ మోడల్ గా ఉండేవారు. కానీ బాహుబలి తరువాత ఆయన లుక్స్ ఆకట్టుకునేలా లేవు. ఈ విషయం పై అభిమానులు ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. బాహుబలి తరువాత ఏ దర్శకుడు ప్రభాస్ కట్ అవుట్ ని స్క్రీన్ పై అందంగా చూపించలేకపోయారని కామెంట్స్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం రిలీజ్ కి సిద్దమవుతున్న 'సలార్' సినిమాలోని లుక్స్ ఫ్యాన్స్ ని కొంచెం ఖుషీ చేస్తున్నాయి.
తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ 'కల్కి' మూవీ షూటింగ్ లో ఉన్నారు. ఆ మూవీ సెట్స్ లో వరల్డ్స్ టాప్ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కో-సీఈవో 'టెడ్ సరాండొస్'.. ప్రభాస్ ని కలుసుకున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ వచ్చిన ఈ సీఈఓ.. టాలీవుడ్ లోని టాప్ హీరోలు అందర్నీ కలుస్తూ వచ్చారు. ఈక్రమంలోనే ప్రభాస్ ని కూడా కల్కి మూవీ సెట్స్ లో కలుసుకున్నారు. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం బయటకి వచ్చాయి.
ఆ పిక్స్ లో ప్రభాస్ గుబురు గడ్డంతో, మెలితిప్పిన మీసాలతో.. బాహుబలి టైం ప్రభాస్ ని చూసినట్లు ఉంది. ఎన్నాళ్లకి ప్రభాస్ ని మళ్ళీ ఇలా చూశాము అంటూ ఫ్యాన్స్ ఆ పిక్ ని వైరల్ చేస్తున్నారు. ఇక ఈ పిక్ చూసిన కొంతమంది.. కల్కి సినిమాలో ప్రభాస్ ఈ లుక్ లో కనిపించబోతున్నారా అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రభాస్ ఇటీవలే తన మోకాలి సర్జరీ పూర్తి చేసుకొని యూరోప్ నుంచి ఇండియా తిరిగి వచ్చారు.
బాహుబలి మూవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయం నుంచి ప్రభాస్.. ఆ మోకాలి నొప్పితో బాధ పడుతున్నారు. అది ఇటీవల బాగా ఎక్కువ అవ్వడంతో ఒక రెండు నెలలు షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చి.. సర్జరీ కోసం ఫారిన్ వెళ్లారు. అక్కడ సక్సెస్ఫుల్ గా చికిత్స పూర్తి చేసుకొని ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో తన సినిమా పనులను మొదలు పెట్టారు. ప్రభాస్ చేతిలో కల్కి, దర్శకుడు మారుతీ సినిమా, సందీప్ వంగా 'స్పిరిట్', సలార్ 2 చిత్రాలు ఉన్నాయి.
Next Story