Mon Dec 23 2024 02:00:35 GMT+0000 (Coordinated Universal Time)
అందరూ నిద్రపోయే టైమ్ లో సలార్ టీజర్.. కొత్త రికార్డులు ?
జులై 6 తెల్లవారుజామున 5.12 గంటలకు సలార్ టీజర్ ను విడుదల చేయనున్నట్లు హోంబలె ఫిలింస్ ట్వీట్ చేసింది. సాధారణంగా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు బాహుబలి 2 తర్వాత ఒక్క హిట్టు ఖాతాలో పడలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ల ప్రయోగాలు విఫలమయ్యాయి. ఆదిపురుష్ విడుదలైన తొలిరోజుల్లో వసూళ్లు వచ్చినా.. తర్వాత నెగిటివ్ టాక్ తో అవి డీలా పడ్డాయి. వివాదాల నడుమ ఆదిపురుష్ థియేటర్లు వెలవెలబోయాయి. రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటాడో ఆన్ స్క్రీన్ పై ఆదిపురుష్ లో చూపిస్తే.. రాక్షసుడిగా ఎలా ఉంటాడో సలార్.. సినిమాలో ప్రశాంత్ నీల్ చూపించనున్నాడని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్న సలార్ టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్.
జులై 6 తెల్లవారుజామున 5.12 గంటలకు సలార్ టీజర్ ను విడుదల చేయనున్నట్లు హోంబలె ఫిలింస్ ట్వీట్ చేసింది. సాధారణంగా ఆ సమయంలో అందరూ నిద్రలో ఉంటారు. మరి ఆ సమయంలో టీజర్ రిలీజ్ అంటే.. కొత్త రికార్డులు సృష్టిస్తుందా ? అని సందేహిస్తున్నారు సినీ విశ్లేషకులు. టీజర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆ టైమ్ కు పడుకుని ఉండరని, మాస్ రికార్డులు ఖాయమంటుంది మూవీ టీమ్. కాగా.. సలార్ టీజర్ 90 సెకన్ల నిడివితో రానుందని ఇప్పటికే సమాచారం అందింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతుందో లేదో చూడాలంటే ఇంకా రెండ్రోజులు వెయిట్ చేయాల్సిందే. శృతి హాసన్ హీరోయిన్ గా, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా, శ్రియారెడ్డి, మరికొంతమంది స్టార్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రల్లో.. భారీ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది సలార్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని సెప్టెంబర్ 28న సినిమా విడుదల చేస్తామని గతంలోనే ప్రకటించింది చిత్రబృందం.
Next Story