Mon Dec 23 2024 01:56:19 GMT+0000 (Coordinated Universal Time)
అక్కడ రిలీజ్ కు సిద్ధమైన సలార్
జపాన్లో సలార్ సినిమా విడుదల అవ్వనుంది. ప్రపంచవ్యాప్తంగా
జపాన్లో సలార్ సినిమా విడుదల అవ్వనుంది. ప్రపంచవ్యాప్తంగా 565 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ప్రభాస్-ప్రశాంత్ నీల్ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా జపాన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి. ప్రభాస్ సాహో జపాన్లో భారీ వసూళ్లను రాబట్టింది. SS రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR 150Cr కంటే ఎక్కువ గ్రాస్ వసూలు చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికీ జపాన్లోని థియేటర్లలో ఆడుతూ ఉంది.ప్రశాంత్ నీల్ KGF సిరీస్, రామ్ చరణ్ రంగస్థలం ఇటీవల జపాన్లో విడుదలయ్యాయి. మంచి కలెక్షన్స్ సాధించాయి.
జపాన్లో విడుదల చేయనున్నట్లు సాలార్ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సలార్ యూనిట్ మంచి ప్రమోషన్స్ చేస్తే బెటర్.. ఇక జపాన్ ప్రేక్షకులకు ప్రభాస్ బాగానే తెలిసి ఉండడంతో సలార్ కి కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సలార్లో శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, టిన్ను ఆనంద్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, బాబీ సింహా కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Next Story