Tue Mar 18 2025 02:58:22 GMT+0000 (Coordinated Universal Time)
సల్మాన్ ఖాన్ కి అనారోగ్యం.. బీ టౌన్ న్యూస్
కాగా.. సల్మాన్ ఖాన్ హిందీ బిగ్ బాస్ సీజన్ -6కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన డెంగ్యూ ఫీవర్ తో చికిత్స..

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ గా.. కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ కండలవీరుడు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. బీ టౌన్ కథనాల ప్రకారం.. సల్మాన్ డెంగ్యూ బారిన పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది.
కాగా.. సల్మాన్ ఖాన్ హిందీ బిగ్ బాస్ సీజన్ -6కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన డెంగ్యూ ఫీవర్ తో చికిత్స తీసుకుంటుండటంతో.. సల్మాన్ స్థానాన్ని కొన్ని వారాల పాటు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో భర్తీ చేయనున్నారట. ప్రస్తుతం సల్మాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా ఝాన్' సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నటిస్తోన్న పూజా హెగ్డే కూడా ఇటీవల కాలికి గాయమవడంతో రెస్ట్ తీసుకుంటోంది. ఇందులో పూజాకి అన్నయ్యగా మన విక్టరీ వెంకటేష్, అతిది పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిది పాత్రలో కనిపించనున్నారట.
Next Story