‘సాహో’ లో సల్మాన్ ఖానా..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తరువాత ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ మూవీ ‘సాహో’ చేస్తున్నాడు. బాహుబలి తరువాత ప్రభాస్ మార్కెట్ కూడా ఇండియా వైడ్ [more]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తరువాత ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ మూవీ ‘సాహో’ చేస్తున్నాడు. బాహుబలి తరువాత ప్రభాస్ మార్కెట్ కూడా ఇండియా వైడ్ [more]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తరువాత ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ మూవీ ‘సాహో’ చేస్తున్నాడు. బాహుబలి తరువాత ప్రభాస్ మార్కెట్ కూడా ఇండియా వైడ్ పెరగడంతో ఈ మూవీని రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. క్రేజీ ప్రాజెక్ట్ కాబట్టి ఈ మూవీకి సంబంధించి ఏదో ఒక న్యూస్ బయటకి వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నాడనే వార్త వైరల్ అవుతోంది.
ఇద్దరు స్నేహితులు కూడా…
ఇక ఇందులో విలన్ పాత్రలో నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నాడు. అయితే నీల్ నితిన్ ముఖేష్, సల్మాన్ మంచి స్నేహితులు కాబట్టి సల్మాన్ ని ఆయనే సజస్ట్ చేసారని సమాచారం. మరి దీనికి సల్లూభాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇస్తే మాత్రం ఈ సినిమాకి పెట్టే ఖర్చు మొత్తం నెల లోపల వచ్చేయడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఈ మూవీకి బాలీవుడ్లో కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుంది. అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.