Mon Dec 23 2024 03:55:25 GMT+0000 (Coordinated Universal Time)
సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' టీజర్ రిలీజ్..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'టైగర్ 3' టీజర్ రిలీజ్ అయ్యింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan), కత్రినా కైఫ్ (Katrina Kaif) ప్రధాన పాత్రల్లో 2012లో ఆడియన్స్ ముందుకు వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఏక్ థా టైగర్'. ఈ సినిమాలో సల్మాన్ ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తే.. కత్రినా కైఫ్ పాకిస్తాన్ గూఢచారిగా నటించింది. ఈ మూవీ అప్పటిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా 2017లో 'టైగర్ జిందా హై' అంటూ సీక్వెల్ ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకురాగా.. అది సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ మూవీకి మూడో భాగం తీసుకు రాబోతున్నారు.
'టైగర్ కా మెసేజ్' అంటూ టైగర్ 3 చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఆ మూవీ మేకర్స్.. సినిమా ప్రమోషన్స్ కి తెరలేపారు. ఈక్రమంలోనే మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్ట్లో లవ్ కోసం, సెకండ్ పార్ట్లో వైఫ్ కోసం ఫైట్ చేసిన సల్మాన్.. ఈ మూడో భాగంలో కొడుకు కోసం ఫైట్ చేయబోతున్నాడని టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది. మరి ఆ టీజర్ ని ఒకసారి మీరుకూడా చూసేయండి.
మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని యశ్ రాజ్ ఫిలిమ్స్.. తమ స్పై యూనివర్స్ లో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల షారుఖ్ ఖాన్ 'పఠాన్' సినిమాకి టైగర్ మూవీతో కనెక్షన్ పెట్టి ఒక యూనివర్స్ ని క్రియేట్ చేశారు నిర్మాతలు. ఈ స్పై యూనివర్స్ లో టైగర్, పఠాన్, వార్ సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఇక ఇప్పుడు ఈ టైగర్ 3 లో షారుఖ్ ఖాన్.. పఠాన్ గా గెస్ట్ అపిరెన్స్ ఇవ్వబోతున్నాడు. దీపావళి కానుకగా ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. హిందీతో పాటు సౌత్ లాంగ్వేజ్స్ లో కూడా రిలీజ్ కానుంది.
Next Story