Sun Dec 22 2024 22:27:48 GMT+0000 (Coordinated Universal Time)
విజయ్ భార్య గురించి కీలక వ్యాఖ్యలు చేసిన సమంత
హైదరాబాద్‌లో ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. స్టేజ్ మీద విజయ్, సామ్ కలిసి
విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఖుషీ’ సినిమా సెప్టెంబర్ 1వ తారీఖున విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత, విజయ్ దేవరకొండ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. విజయ్‌కు కాబోయే భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలో సమంత చెప్పడం విశేషం. ముఖ్యంగా ఆ అమ్మాయి చాలా సింపుల్‌గా ఉండాలని.. అతడి కుటుంబంతో సులువుగా కలిసిపోవాలని సమంత చెప్పింది. అందుకు విజయ్ కూడా అంగీకరించడం విశేషం. విజయ్ ఫోన్ కాల్ కంటే మెసేజీలే ఎక్కువగా చేస్తాడని తెలిపింది. గేమింగ్ యాప్స్ ఎక్కువగా వాడతాడని, అతడికి ఫ్రెండ్స్ ఎక్కువ అని తెలిపింది.
హైదరాబాద్‌లో ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. స్టేజ్ మీద విజయ్, సామ్ కలిసి లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వడం విశేషం. స్టేజీపై డ్యాన్స్ చేశారు. విజయ్ షర్ట్ తీసేసి మరీ.. సామ్‌ను ఎత్తుకుంటూ, తిప్పుతూ సందడి చేశారు. వీరి పర్ఫామెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. విజయ్ దేవరకొండతో కలిసి స్టేజ్ పైనే లైవ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. ఖుషీ టైటిల్ సాంగ్ పై ఆమె చేసిన ఎనర్జటిక్ డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఖుషీ మ్యూజికల్ కాన్సర్ట్ కోసం సమంత గంటల వ్యవధిలో మూడు కాస్ట్యూమ్స్ ఛేంజ్ చేసి ఆశ్చర్యపరిచింది. చివర్లో మెరూన్ కలర్ చీరలో సమంత కనిపించింది. సినిమా మీద అంచనాలు ఎక్కువయ్యేలా మరిన్ని ప్రమోషనల్ ఈవెంట్ లను కూడా చేయబోతోంది ఖుషీ టీమ్.
Next Story