సమంత మళ్ళీ అదరగొట్టింది
ప్రతి సంవత్సరం మాదిరిగానే, టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం ఆన్లైన్ పోల్‌ను నిర్వహించింది. అలాగే 2019 సంవత్సరానికి హైదరాబాద్ మోస్ట్ డిసైరబుల్ విమెన్ గా అర్హత [more]
ప్రతి సంవత్సరం మాదిరిగానే, టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం ఆన్లైన్ పోల్‌ను నిర్వహించింది. అలాగే 2019 సంవత్సరానికి హైదరాబాద్ మోస్ట్ డిసైరబుల్ విమెన్ గా అర్హత [more]
ప్రతి సంవత్సరం మాదిరిగానే, టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం ఆన్లైన్ పోల్‌ను నిర్వహించింది. అలాగే 2019 సంవత్సరానికి హైదరాబాద్ మోస్ట్ డిసైరబుల్ విమెన్ గా అర్హత ఉన్నమహిళలను జాబితా చేసింది. అయితే ఈ ఏడాది మాత్రం 2018 సంవత్సరానికి మోస్ట్ డిసైరబుల్ విమెన్ గా టాప్ స్లాట్‌ను కైవసం చేసుకున్న హైదరాబాదీ అదితి రావు హైదారీ నాలుగో స్థానానికి పడిపోయింది. అక్కినేని వారి కోడలు సమంత మాత్రం ఈ ఏడాది మోస్ట్ డిసైరబుల్ విమెన్ గా నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఎప్పుడూ ఫ్యాషనబుల్ గా ఉండే సమంత.. ఇప్పుడు మరింత గ్లామరస్ ఫ్యాషన్ తో రెచ్చిపోతుంది. అలాగే అద్భుతమైన సినిమాల్తో ఆకట్టుకుంటుంది.
అయితే ఈఏడాది 2019 జాబితాలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…కొత్తగా సంజన విజె అనే అమ్మాయి రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2019 టైటిల్ ను గెలుచుకున్న తరువాత సంజన జాతీయ సంచలనంగా మారడమే కాదు… ఫెమినా మిస్ ఇండియా రన్నరప్ కిరీటాన్ని పొందింది. అలాంటి అమ్మాయి 2019 మోస్ట్ డిసైరబుల్ విమెన్ గా సెకండ్ ప్లేస్ లో ఉండగా. ఆతరవాతి స్థానాల్లో బ్యాడ్మింటన్ సంచలనం పివి సింధు మూడవ స్థానాన్ని దక్కించుకోగా… నటి పూజా హెగ్డే ఐదో స్థానంలో నిలిచింది.
ఇక్కడ టాప్ 10 జాబితా ఉంది:
1. సమంత అక్కినేని
2. సంజన విజె
3. పివి సింధు
4. అదితి రావు హైదారీ
5. పూజ హెగ్డే
6. రాజా కుమారి
7 . రకుల్ ప్రీత్
8. కాజల్ అగర్వాల్
9. రష్మిక మందన్న
10. నికిత తన్వాని