సమంత వచ్చింది.. కోట్లు పట్టుకుపోయింది!!
తెలుగులో బిగ్ బాస్ అంటే ఎన్టీఆర్, నాని, గత రెండు సీజన్స్ హోస్ట్ చేస్తున్న నాగార్జునలు. కానీ గత సీజన్ లో నాగ్ బర్త్ డే కి [more]
తెలుగులో బిగ్ బాస్ అంటే ఎన్టీఆర్, నాని, గత రెండు సీజన్స్ హోస్ట్ చేస్తున్న నాగార్జునలు. కానీ గత సీజన్ లో నాగ్ బర్త్ డే కి [more]
తెలుగులో బిగ్ బాస్ అంటే ఎన్టీఆర్, నాని, గత రెండు సీజన్స్ హోస్ట్ చేస్తున్న నాగార్జునలు. కానీ గత సీజన్ లో నాగ్ బర్త్ డే కి నాగ్ విదేశాలకు వెళ్లగా రమ్యకృష్ణ ఓ రెండు ఎపిసోడ్స్ ని హోస్ట్ చేసింది. ఇక నాగార్జున శని ఆదివారాలు హోస్టింగ్ కి టీఆర్పీస్ కానీ, క్రేజ్ కానీ విపరీతంగా ఉంటుంది. అయితే తాజా సీజన్ లోను నాగార్జున తన బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలను మరొకరికి అప్పజెప్పాడు. తన వైల్డ్ డాగ్ షూటింగ్ లో భాగంగా కులుమనాలి వెల్లిన నాగ్ తన స్థానంలోకి ఆయన కోడలు సమంతని తీసుకొచ్చాడు. మరి అక్కినేని కోడలు, టాప్ హీరోయిన్, యంగ్ హీరో భార్య సమంత బిగ్ బాస్ హోస్ట్ అంటే ఎంత క్రేజు, ఎంత హైప్.
అంతే హైప్ ని గత రెండు రోజులుగా స్టార్ మా గంట గంటకి క్రియేట్ చేస్తూనే ఉంది. శనివారం నాగ్ – సమంత కూడా లేకుండా నార్మల్ గా సాగిన బిగ్ బాస్.. దసరా ఆదివారం ఎపిసోడ్ ని మూడున్నర గంటల లాంగ్ ఎపిసోడ్ ని ప్రసారం చేసింది. ఇక హోస్ట్ గా నాగ్ కోడలు సమంతని పరిచయం చేసి త్పపుకోగా సమంత ఎంతో అనుభవం ఉన్న యాంకర్ గా బిగ్ బాస్ స్టేజ్ పై అదరగొట్టేసింది. పట్టు చీర కట్టుకుని.. మేడలో బంగారు ఆభరణలో అక్కినేని కోడలు సమంత మెరిసిపోయింది. మరిది అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పబ్లిసిటి తో పాటుగా… జబర్దస్త్ అది తో హౌస్ మేట్స్ తో ఆటలు, పాటలు, డాన్స్ లు, మధ్యలో బిగ్ బాస్ స్టేజ్ మీద కార్తికేయ డాన్స్, పాయల్ అందాలు… మధ్య మధ్యలో ఎలిమినేషన్ నుండి సేవ్ చెయ్యడం అబ్బో సమంత అదరగొట్టేసింది.
ఇక సమంత అరియనా , అఖిల్ మోనాల్ ని, అభిజిత్, అవినాష్, నోయెల్ లను సేవ్ చెయ్యగా.. చివరికి దివి ఎలిమినేట్ అయ్యి సమంతతో బిగ్ బాస్ స్టేజ్ మీదికెక్కింది. తక్కువ టైంలోనే లాస్య మీద బిగ్ బాంబు వేసి సమంతతో సెల్ఫీ దిగి దివి ఇంటికెళ్ళిపోగా.. ఈ వారం ఒకే ఒక్క భారీ ఎపిసోడ్ ని అదరగొట్టిన సమంత.. ఈ ఒక్క ఎపిసోడ్ తో పాటుగా.. వచ్చే రెండు ఎపిసోడ్స్ కి భారీ పారితోషకం అందుకుందనే టాక్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. నాగార్జున సీజన్ మొత్తానికి 8 కోట్లు అందుకుంటే..సమంతకి రెండు మూడు ఎపిసోడ్స్ కె 2 కోట్లకి పైగా ఇస్తున్నారనే టాక్ అందరిని షేక్ చేస్తుంది. మొదటి ఎపిసోడ్ మూడున్నర గంటలు ప్లాన్ చెయ్యగా.. తర్వాత గంటన్నర ఎపిసోడ్ కి కలిపి సమంతకి ఏకంగా 2 కోట్లకు పైగానే స్టార్ మా ముట్టజెబుతుందట.