Mon Nov 25 2024 00:13:52 GMT+0000 (Coordinated Universal Time)
Samantha : రెండో పెళ్లి పై సమంత కామెంట్స్.. ఏమందంటే..?
రెండో పెళ్లి పై సమంత కామెంట్స్. మెుదటి పెళ్ళికి సంబంధించిన డివోర్స్ కేసు..
Samantha : టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య సమంత విడాకులు తీసుకుని ఏళ్లు గడుస్తుంది. కానీ ఈ వార్త మాత్రం నెట్టింట ఇంకా హార్ట్ టాపిక్ గానే ఉంది. ప్రతిసారీ ఈ విడాకులు ప్రశ్న నాగచైతన్య, సమంతలకు ఎదురవుతునే ఉంటుంది. తాజాగా సమంత ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానాలు ఇస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని రెండో పెళ్లి గురించి ప్రశ్నించాడు.
"మీరు రెండో పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా..?” అని ప్రశ్నించాడు. దీనికి సమంత బదులిస్తూ.. డివోర్స్ కి సంబంధించిన ఒక సర్వే స్టాటిస్టిక్స్ ని షేర్ చేశారు. ఆ స్టాటిస్టిక్స్ ఏంటంటే.. 2023 సర్వే ప్రకారం మెుదటి పెళ్ళికి సంబంధించిన డివోర్స్ కేసులు శాతం 50% ఉందట. అదే రెండో, మూడో పెళ్ళికి సంబంధించిన డివోర్స్ కేసులు శాతం 67%, 73% ఉందట. ఇక ఈ స్టాటిస్టిక్స్ బట్టి రెండో పెళ్లి పై ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది తప్పు నిర్ణయం అని సమంత చెప్పుకొచ్చింది. ఈ ఆన్సర్ బట్టి ఆమె ఇన్‌డైరెక్ట్ గా రెండో పెళ్లి చేసుకోను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఇదే చిట్ చాట్‌లో మరో అభిమాని.. మీ మొబైల్ వాల్‌పేపర్ ఏంటని ప్రశ్నించాడు. దాని ఆమె వాల్ పేపర్ ని స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు. కోయంబత్తూరు ఇషా ఫౌండేషన్‌లో కనిపించే లింగ భైరవి అమ్మవారి పిక్ ని సమంత వాల్‌పేపర్ గా పెట్టుకున్నారు. అలాగే మరో అభిమాని సమంత ఫేవరెట్ కాఫీ ఏంటని ప్రశ్నించగా.. ‘అమెరికానో’ అని బదులిచ్చారు. ఇక మరో అభిమాని.. "ఒక వరస్ట్ ఇయర్ ముగిసింది" అంటూ కామంట్ చేయగా, సమంత బదులిస్తూ.. "హా అవును. నేను అదే ఫీల్ అవుతున్నాను" అంటూ రాసుకొచ్చారు.
Next Story