Mon Dec 23 2024 07:06:36 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో సమంత సరికొత్త రికార్డు..
ఖుషి సినిమాతో అమెరికాలో సరికొత్త రికార్డుని క్రియేట్ చేసిన సమంత. అదేంటో తెలుసా..?
సమంత (Samantha) అనారోగ్యం కారణంగా వాయిదా పడుతూ వచ్చిన 'ఖుషి' (Kushi) సినిమా ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేశాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యింది.
బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ మంచి సక్సెస్ టాక్ ని సొంతం చేసుకుంది. సమంత స్టార్డమ్ ఈ మూవీ కలెక్షన్స్ కి బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి. ఫస్ట్ డేనే ఈ మూవీ రూ.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని విజయ్ కి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించింది. ఇది ఇలా ఉంటే, ఈ చిత్రంతో సమంత అమెరికాలో సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. అమెరికన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ మొదటి రెండు రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ ని అందుకొని సంచలనం సృష్టించింది. అయితే ఇది కాదు అసలైన రికార్డు.
ఈ చిత్రంతో కలుపుకొని సమంత నటించిన 17 సినిమాలు అమెరికాలో 1 మిలియన్ డాలర్ మార్క్ ని అందుకున్నాయి. ఈ రికార్డు సాధించిన ఏకైక ఇండియన్ యాక్ట్రెస్ గా సమంత రికార్డు సృష్టించింది. దీంతో అభిమానులకు సోషల్ మీడియా వేదికగా థాంక్యూ చెప్పింది. తనపై చూపిస్తున్న ప్రేమకు ఎప్పటికి రుణపడి ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఈ చిత్రం మొదటి వీకెండ్ పూర్తి చేసుకునేపాటికి రూ.70.23 కోట్ల గ్రాస్ ని అందుకుంది.
మొదటి మూడు రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 53 కోట్ల వరకు జరిగిందని సమాచారం. కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. దాదాపు 55 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. అంటే.. గ్రాస్ కలెక్షన్స్ సుమారు 110 కోట్ల పైనే వచ్చి ఉండాలి. ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే.. ఈ మూవీ మరో 40 కోట్లు రాబడితే చాలు లాభాలు బాట పడుతుంది.
Next Story