Mon Dec 23 2024 02:17:02 GMT+0000 (Coordinated Universal Time)
సమంత సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటోందా ?
ఈ నేపథ్యంలో తాజాగా.. ఓ వార్త వైరల్ అవుతోంది. సమంత ఇప్పట్లో నటించేది లేదని, సమస్య నుంచి పూర్తిగా కోలుకునేంత..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో సమంత సతమతమవుతుందని తెలిసినప్పటి నుండి.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాంతక వ్యాధే అయినా.. త్వరగా కోలుకుని వస్తానని చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది సామ్. ఆ తర్వాత యశోద సక్సెస్ గురించి రెండు, మూడు పోస్టులు చేసింది. కానీ.. సామ్ ఇంతకు ముందు ఉన్నంత హుషారుగా ఇప్పుడు సోషల్ మీడియాలోనూ కనిపించకపోవడంతో మరింత గాబరా పడుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా.. ఓ వార్త వైరల్ అవుతోంది. సమంత ఇప్పట్లో నటించేది లేదని, సమస్య నుంచి పూర్తిగా కోలుకునేంత వరకు నటనకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారంటూ వార్తలొస్తున్నాయి. హిందీలో ది ఫ్యామిలీ సీజన్ 2 హిట్ తర్వాత.. సామ్ కు వరుసగా బాలీవుడ్ ఆఫర్లొచ్చాయి. వాటిలో తనకు నచ్చిన సినిమాలకు సైన్ చేసిందట. కానీ.. మయోసైటిస్ కారణంగా కొన్నాళ్లపాటు తాను నటన నుండి బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్లు చిత్ర నిర్మాతలకు చెప్పిందని సమాచారం. సామ్ రావడానికి టైమ్ పట్టేలా ఉందనుకున్నవారు మరో హీరోయిన్ వేటలో పడ్డారని తెలుస్తోంది. కాగా.. విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా పూర్తయిన తర్వాత సమంత లాంగ్ బ్రేక్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటివరకూ సామ్ ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు గానీ, సోషల్ మీడియాలో పోస్టులు గానీ చేయలేదు.
Next Story