ఆ పాత్రలకి ఆమె తప్ప మరో ఆప్షన్ లేదా?
పెళ్లి తర్వాత సమంత రేంజ్ మారిపోతుంది. ఆమెకి అవకాశాలే రావు అనుకున్నవారికి.. సమంత ఎప్పటికప్పుడు హిట్ సినిమాలు చేస్తూ సమాధానం చెబుతూనే ఉంది. పెళ్లి తర్వాత గ్లామర్ [more]
పెళ్లి తర్వాత సమంత రేంజ్ మారిపోతుంది. ఆమెకి అవకాశాలే రావు అనుకున్నవారికి.. సమంత ఎప్పటికప్పుడు హిట్ సినిమాలు చేస్తూ సమాధానం చెబుతూనే ఉంది. పెళ్లి తర్వాత గ్లామర్ [more]
పెళ్లి తర్వాత సమంత రేంజ్ మారిపోతుంది. ఆమెకి అవకాశాలే రావు అనుకున్నవారికి.. సమంత ఎప్పటికప్పుడు హిట్ సినిమాలు చేస్తూ సమాధానం చెబుతూనే ఉంది. పెళ్లి తర్వాత గ్లామర్ డాల్ గా మారిన సమంత సినిమాల్లో మాత్రం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకి మొగ్గు చూపుతుంది అనేది.. ఆమె చేసిన వరస సినిమాలు చూస్తే తెలుస్తుంది. మజిలీ, ఓ బేబీ, యు టర్న్, నిన్న విడుదలయిన జాను సినిమాలు ఉదాహరణలు. యు టర్న్ లో అందంగా గ్లామర్ గా అదరగొట్టిన సమంత, మజిలీ సినిమాలో చైతూకి కి వైఫ్ గా బలమున్న కేరెక్టర్ లో ఎమోషనల్ గా సూపర్ అనిపించింది. ఇక ఓ బేబీ లో సమంత నటనకు అందరూ షాకవ్వల్సిందే. అంత అద్భుతంగా నటించింది.
ఇక తాజాగా 96 రీమేక్ జాను సినిమాలో టైటిల్ రోల్ పోషించిన సమంత జాను అలియాస్ జానకి దేవి పాత్రకి ప్రాణం పోసింది. సమంత కి ఇది చాలా కష్టతరమైన పాత్ర అయినప్పటికి ఆమె మరోసారి తానేంటో నిరూపించుకుంది. ఈ సినిమాలో సమంత పర్ఫార్మెన్స్ కన్నీరు పెట్టిస్తుంది. లుక్స్, పెర్ఫామెన్స్ విషయంలో త్రిషతో పోలిస్తే సమంత తక్కువగా కనిపిస్తుంది కానీ.. తెలుగులో ఈ పాత్ర చేయడానికి సమంత కంటే మంచి ఛాయిస్ లేదన్న ఫీలింగ్ కలిగించేలా ఆమె నటించింది. మరి ఇలాంటి పాత్రలకు సమంత నే బెస్ట్ ఛాయస్ గా కన్పిస్తుంది. దిల్ రాజు మొదటినుండి సమంత నే ఈ పాత్రకి ఎందుకు అనుకున్నాడో.. ఆయన ఛాయస్ ఎంత బెస్టో అనేది సమంత జాను కేరెక్టర్ నిజం చేసి చూపించింది.