Mon Dec 23 2024 13:05:46 GMT+0000 (Coordinated Universal Time)
చనిపోయే స్టేజ్ లో లేను.. అంటూ ఇంటర్వ్యూలో ఏడ్చిన సమంత
కొద్దిరోజుల క్రితం సమంత ముఖంలో మార్పు వచ్చిందని, ఆమె సర్జరీ చేయించుకుందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత సమంత మయోసైటిస్ అనే ..
చైతూతో విడాకుల తర్వాత సమంత నుండి పెద్దగా సినిమాలేవీ విడుదల కాలేదు. గతేడాది చివర్లో విడుదలైన పుష్ప సినిమాలో ఊ అంటావా మావా పాటలో మాత్రం కనిపించింది. సమంత నుండి ఫుల్ లెంగ్త్ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. చాలా కాలం తర్వాత సమంత యశోద అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రానుంది. తమిళ డైరెక్టర్స్ హరి-హరీష్ దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ యశోద సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా నవంబర్ 11న పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది.
కాగా.. కొద్దిరోజుల క్రితం సమంత ముఖంలో మార్పు వచ్చిందని, ఆమె సర్జరీ చేయించుకుందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందని తెలిసింది. వ్యాధి కారణంగానే సమంత ముఖంలో మార్పులొచ్చినట్లు అభిమానులు భావిస్తున్నారు. తాజాగా సమంత ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గమనించవచ్చు. వ్యాధితో బాధపడుతున్న సమంత యశోద సినిమా ప్రమోషన్స్ కోసం బయటికి వస్తుందా లేదా అని అందరూ సందేహించారు. ఎట్టకేలకు సమంత యశోద ప్రమోషన్స్ కోసం బయటికొచ్చింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత యాంకర్ సుమకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఈ ఇంటర్వ్యూలో సమంత తన సినిమా గురించి, వ్యాధి గురించిన విషయాలను చెప్పుకొచ్చింది. తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని గురించి చెబుతూ కంటతడి పెట్టుకుంది. "లైఫ్ లో కొన్ని మంచి రోజులు, కొన్ని బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి. ఒకానొక స్టేజిలో లైఫ్ లో ముందుకెళ్లలేనేమో అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఇంతదాకా వచ్చానా అనిపిస్తుంది. ప్రస్తుతం చచ్చిపోయే స్టేజిలో అయితే లేను కానీ.. కొద్దిగా సీరియస్ గానే ఉంది. అందుకు చికిత్స తీసుకుంటున్నాను. త్వరలోనే మరింత ఆరోగ్యంగా తిరిగి వస్తాను అని చెప్తూ ఏడ్చేసింది సమంత. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. సమంత అభిమానులు, నెటిజన్లు నువ్వు త్వరగా కోలుకుంటావ్ అని కామెంట్స్ చేస్తున్నారు.
సమంత ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి
Next Story