గ్లామర్ కి బై చెప్పేసిందా..?
టాలీవుడ్ గ్లామర్ భామగా టాప్ పొజిషన్ లో కొనసాగిన సమంత అందాలు ఆరబొయ్యడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. ఆఖరికి పెళ్లయ్యాక కూడా బికినీ వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సమంత సినిమాల్లో గ్లామర్ షో విచ్చలవిడిగా చెయ్యకపోయినా... బాగానే గ్లామర్ ఆరబోసింది. గ్లామర్ పాత్రలే ఎక్కువగా చేసిన సమంత ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ఓటేస్తుంది. మరి నాగ చైతన్యతో పెళ్లయ్యాక కూడా కెరీర్ లో సినిమాల మీద సినిమాలు చేస్తూ హిట్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత అక్కినేని ఇంటి కోడలిగా గ్లామర్ పాత్రలకు బై బై చెప్పెయ్యబోతుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన సమంత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకే అధిక ప్రాధాన్యత నిస్తుంది.
నందినీ రెడ్డి డైరెక్షన్ లో...
తాజాగా యూ-టర్న్ తో లేడి ఓరియెంటెడ్ గా హిట్ అందుకున్న సమంత మరో లేడి ఒరియెంటెడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందనే న్యూస్ నడుస్తుంది. అది కూడా సురేష్ ప్రొడక్షన్ లో ఉండబోతుంది. ఇక ప్రస్తుతం వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్న సమంత... తన పెళ్లి రోజు అంటే అక్టోబర్ 6 న నాగ చైతన్య తో కలిసి శివ నిర్వాణ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కానుంది. సమంత నందినిరెడ్డి కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. వీరిద్దరి కాంబోలో త్వరలో ఓ సినిమా రూపుదిద్దుకోనున్నట్టు టాలీవుడ్ టాక్. ఇక సమంత లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు సై అంటుంది అంటే ఇక గ్లామర్ పాత్రలకు బై బై చెప్పినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే కోలీవుడ్ లో నయనతారకి లేడి ఒరియెంటెడ్ చిత్రాలతో ఎంత క్రేజొచ్చిందో.. స్టార్ హీరోల సరసన అంటే క్రేజుంది. కారణం నయన్ కి ఇంకా పెళ్లి కాలేదు కనక. కానీ సమంత మాత్రం ఒకసారి లేడి ఒరింటెడ్ చిత్రాలకు సై అంటే ఆమెకి గ్లామర్ పాత్రలు రావడం కాస్త కష్టమే.