Mon Dec 23 2024 06:13:51 GMT+0000 (Coordinated Universal Time)
మళ్ళీ హాస్పిటల్ బెడ్‌పై సమంత.. చేతికి సెలైన్‌తో..
మొన్నటివరకు విదేశాల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించిన సమంత.. ఇప్పుడు సడన్ గా హాస్పిటల్ బెడ్ కనిపిస్తుంది.
మయోసైటిస్ వ్యాధితో బాధ పడుతున్న హీరోయిన్ సమంత.. దాని నుంచి పూర్తిగా కోలుకునేందుకు సినిమాలకు బ్రేక్ ప్రకటించి చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఇన్ని రోజులు అమెరికా, యూరోప్ వంటి దేశాలో హుషారుగా చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించిన ఈ భామ.. ఇప్పుడు సడన్ గా హాస్పిటల్ బెడ్ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోని సమంత స్వయంగా షేర్ చేసింది.
సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటో షేర్ చేసింది. ఆ ఫొటోలో చేతికి సెలైన్‌తో సమంత హాస్పిటల్ బెడ్ పై కనిపిస్తుంది. ఇక మరో చేతిలో లాప్టాప్ పట్టుకొని ఏదో మూవీ చూస్తుంది. ఈ పోస్టుకి సమంత రాసుకొచ్చిన కామెంట్స్ చూస్తుంటే.. బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడం కోసం సమంత ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఇన్ని రోజులు సమంతని హుషారుగా చూసిన అభిమానులు.. ఆమెను మళ్ళీ హాస్పిటల్ బెడ్ పై చూడడంతో కంగారు పడుతున్నారు.
ఇది ఇలా ఉంటే, కొన్ని రోజులు నుంచి సమంత, నాగచైతన్య గురించి నెట్టింట చర్చ జరుగుతుంది. సమంత దగ్గర 'హాష్' అనే ఒక పెంపుడు కుక్క ఉన్న విషయం తెలిసిందే. ఇక మొన్నటి వరకు సమంత దగ్గరే ఉన్న ఈ కుక్క.. ఇప్పుడు సడన్ గా నాగచైతన్య దగ్గర కనిపిస్తుంది. ప్రస్తుతం నాగచైతన్య ఆ కుక్కతో హ్యాపీ టైం స్పెండ్ చేస్తూ, అందుకు సంబంధించిన ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ లో కూడా షేర్ చేస్తున్నాడు.
ఇక ఈ పోస్టు చూసిన ఆడియన్స్‌లో.. చై-సామ్ మళ్ళీ కలుస్తున్నారా..? అనే ఒక ఆశ మొదలైంది. అయితే సమంత తన పోస్టులతో అభిమానుల ఆశల మీద నీరు చల్లింది. సమంత ఇటీవల షేర్ చేసిన ఫొటోల్లో.. నడుము మీద ఉండాల్సిన నాగచైతన్య టాటూ ఇప్పుడు కనిపించడం లేదు. దీంతో చైతన్యని సమంత పూర్తిగా తన లైఫ్ లో నుంచి చెరిపేసిందా..? అనే సందేహం మొదలయ్యింది. ఈ ఇద్దరి పోస్టులు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Next Story