Thu Dec 26 2024 19:43:10 GMT+0000 (Coordinated Universal Time)
దేశంలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా సమంత.. ఓర్మాక్స్ సర్వేలో వెల్లడి
ఓర్మాక్స్ సర్వేలో భారతదేశంలో మహిళా తారల జాబితాలో సమంత అగ్రస్థానంలో నిలిచింది. బాలీవుడ్ హీరోలతో సమానంగా ..
హైదరాబాద్ : సమంత.. ఏమాయ చేశావె సినిమాతో అందరినీ ఏదో మాయ చేసేసింది. అప్పట్నుంచి వెనుదిరిగి చూసుకోకుండా.. వరుస హిట్లు అందుకుంది. మధ్య మధ్యలో ఫ్లాపులు పడినా.. కుంగిపోకుండా నిలబడింది. వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా.. సమర్థవంతంగా ఎదుర్కొంది. వెబ్ సిరీస్ లు, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు.. మళ్లీ ప్రేమ కథా చిత్రాల్లో నటించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మజిలీ దర్శకుడు శివ నిర్వాణ, విజయదేవరకొండతో కలిసి సమంత ఖుషి సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తికాగా.. యశోద మూవీ షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది.
శాకుంతలం, యశోద సినిమాలు లేడి ఓరియెంటెడ్ సినిమాలే. తాజాగా ఓర్మాక్స్ మీడియా సంస్థ చేసిన సర్వేలే సమంత పేరు దేశం దాటి మారుమోగిపోతుందని తెలిసింది. ఓర్మాక్స్ సర్వేలో భారతదేశంలో మహిళా తారల జాబితాలో సమంత అగ్రస్థానంలో నిలిచింది. బాలీవుడ్ హీరోలతో సమానంగా క్రేజ్ ఉన్న అలియా భట్ రెండో స్థానంలో నిలిచింది. ఆమె తర్వాత నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పదుకొనే, రష్మిక మందన, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, కీర్తి సురేష్ మరియు పూజా హెగ్డే ఉన్నారు. మేల్ స్టార్స్ లో తమిళ సూపర్ స్టార్ విజయ్ మొదటి స్థానంలో నిలవగా.. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Next Story