Mon Dec 23 2024 14:07:35 GMT+0000 (Coordinated Universal Time)
శాకుంతలం నుంచి సమంత లుక్.. ఎంత అందంగా ఉంది !
సమంత పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం 'శాకుంతలం' సినిమా నుంచి సమంత స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. 'శకుంతల' పాత్రలో
హైదరాబాద్ : తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో సమంతకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సమంత బాలీవుడ్ లోనూ అడుగుపెట్టాలన్న పట్టుదలతో ఉంది. తాజాగా సమంత నటించిన సినిమా 'శాకుంతలం'. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. నీలిమ గుణ సినిమాను నిర్మించగా.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత బాణీలు సమకూర్చారు.
నేడు సమంత పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం 'శాకుంతలం' సినిమా నుంచి సమంత స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.'శకుంతల' పాత్రలో దేవకన్యలా మెరిసిపోతూ సమంత చాలా అందంగా కనిపిస్తోంది. శాకుంతలంలో దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నాడు. ఈ ఏడాదిలోనే శాకుంతలం విడుదల కానుంది. ప్రస్తుతం సమంత.. లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే 'యశోద' సినిమా చేస్తోంది. అలాగే శివనిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి మరొక సినిమాకు సామ్ సైన్ చేసింది. త్వరలోనే సమంత ఈ షూటింగ్ లో పాల్గొననుంది.
Next Story