హీరోలను తొక్కేస్తుందా?
పెళ్లి తర్వాత సమంత సినిమాల ప్రభంజనం ఎలా ఉంది అంటే.. ఏ సినిమా లో సమంత ఉంటే ఆ సినిమా హిట్ అనేంతగా సమంత క్రేజ్ రోజు [more]
పెళ్లి తర్వాత సమంత సినిమాల ప్రభంజనం ఎలా ఉంది అంటే.. ఏ సినిమా లో సమంత ఉంటే ఆ సినిమా హిట్ అనేంతగా సమంత క్రేజ్ రోజు [more]
పెళ్లి తర్వాత సమంత సినిమాల ప్రభంజనం ఎలా ఉంది అంటే.. ఏ సినిమా లో సమంత ఉంటే ఆ సినిమా హిట్ అనేంతగా సమంత క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. . రంగస్థలం లో రామ్ చరణ్ తో పోటీ పడి నటించిన సమంత పెళ్లి తర్వాత పద్దతిగా ప్రత్యేకమైన పాత్రలకే పరిమితమవుతుంది. సినిమాల్లో ప్రత్యేకమైన పాత్రలతో అదరగొడుతున్న ఈ భామ బయట మాత్రం హాట్ గర్ల్ గానే దర్శనమిస్తుంది. నెటిజెన్స్ ఎంతమంది ఎన్ని అన్నా పట్టించుకోని సమంత మాత్రం మరో రెండు మూడేళ్లే సినిమాలు చేస్తానేమో అని స్టేట్మెంట్ ఇచ్చింది. మరి తర్వాత సమంత ని ఏ నిర్మాతగానే చూస్తామేమో మనం కూడా. అయితే సమంత పెళ్లి తర్వాత చేసిన సినిమాల్లో హీరోలను తొక్కేసి మరీ నట విశ్వరూపం చూపిస్తుంది.
మజిలీ సినిమానే తీసుకోండి సమంత సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చేవరకు సినిమాపై ఓ ఫీల్ లో ఉన్న ప్రేక్షకుడు సమంత ఎంట్రీ తో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. చైతు ఎంతగా నటించిన సమంత ముందు తేలిపోయాడు. అంతలాంటి శ్రావణి పాత్రలో సమంత ఇరగదీసింది. ఇక యు టర్న్ అంతే. రాహుల్ రవీంద్ర ప్రేక్షక పాత్రే. అలాగే ఓ బేబీ సినిమాలోనూ నాగ శౌర్య కూడా డమ్మీనే. తాజాగా శర్వా తో కలిసి నటించిన జాను సినిమాలో శర్వా ఓ మెట్టు సమంత పైనే ఉన్నప్పటికీ.. ఎక్కువగా సమంతానే ఫోకస్ అయ్యింది. జాను టైటిల్ పాత్రలో సమంత ఇరగదీసింది. అలా అని శర్వా తక్కువేమి కాదు.. సమంత తో పోటీ పడి నటించాడు. కానీ అందరి కళ్ళు సమంత నటన, ఆమె లుక్స్ మీదే. జాను లో సమంత ఓ అద్భుతం అంటున్నారు. మరి సమంత పెళ్లి తర్వాత చేసే పాత్రలతో హీరోలను ఓ తొక్కు తొక్కి వదిలిపెడుతుందన్నమాట. అందుకే సమంత ముందు మనమెంత అన్నట్టుగా ఉన్నారు యంగ్ హీరోలంతా.