Mon Dec 23 2024 07:04:35 GMT+0000 (Coordinated Universal Time)
మొన్నటివరకు సమంత దగ్గర.. ఇప్పుడు చైతన్య దగ్గర.. ఏంటి విషయం..?
మొన్నటివరకు సమంత దగ్గర ఉన్న కుక్క ఏంటి ఇప్పుడు నాగచైతన్య దగ్గర ఉంది.
టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ నాగచైతన్య, సమంత విడిపోయి సంవత్సరాలు గడుస్తున్నా.. వారి గురించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ అవుతూనే ఉంది. 2017లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ.. 2021లో విడాకులు తీసుకోని చట్టపరంగా విడిపోయారు. అక్కడి నుంచి ఈ ఇద్దరు ఈ విషయాన్ని మర్చిపోయి తమ తమ కెరీర్ పై ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్నారు. కానీ సోషల్ మీడియాలోని నెటిజెన్స్ మాత్రం.. ఈ విడాకుల విషయం గురించి మాట్లాడుతూనే వస్తున్నారు.
అంతేకాదు ప్రెస్ మీట్స్, సినిమా ఇంటర్వ్యూల్లో కూడా ఇదే విషయంపై ప్రశ్నలు వేస్తున్నారు. ఈక్రమంలోనే 'కస్టడీ' మూవీ ప్రమోషన్స్ లో సమంత గురించి నాగచైతన్య మాట్లాడిన మాటలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. సమంత మంచి అమ్మాయి అని, తను ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటానని, సోషల్ మీడియాలో వచ్చే వార్తలు వల్లే ఇద్దరు మధ్య గొడవలు వచ్చి విడిపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
ఇది ఇలా ఉంటే, తాజాగా ఒక విషయంలో వీరిద్దరూ మళ్ళీ నెట్టింట వైరల్ అవుతున్నారు. సమంత దగ్గర 'హాష్' అనే ఒక పెంపుడు కుక్క ఉన్న విషయం తెలిసిందే. ఈ కుక్క మొన్నటి వరకు సమంత దగ్గరే ఉంది. కానీ ఇప్పుడు సడన్ గా నాగచైతన్య దగ్గర కనిపించింది. ఆ కుక్క చైతన్యతో ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
నాగచైతన్య దగ్గర పని చేస్తున్న ఒక వ్యక్తి ఇటీవల కొత్తగా బైక్ కొనుక్కున్నాడు. ఆ బైక్ పై చైతన్య ఆటోగ్రాఫ్ తీసుకోని అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశాడు. ఇక ఆ విడియోలోనే సమంత పెంపుడు కుక్క 'హాష్' కూడా కనిపించింది. సమంత దగ్గర ఆ కుక్క ఎప్పటినుంచో ఉంది. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ కుక్క నాగచైతన్యకి కూడా బాగా అలవాటు అయ్యింది. ఆ సమయంలో 'హాష్'తో ఉన్న కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశారు.
కాగా సమంత ప్రస్తుతం మయోసిటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో 'హాష్'ని నాగచైతన్య దగ్గర వదిలి వెళ్లిందా..? ఇందుకోసం వీరిద్దరూ కలుసుకున్నారా..? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇక నెట్టింట చైతన్యతో హాష్ ఉన్న వీడియో చూసిన నెటిజెన్స్.. సమంత కుక్క ఏంటి నాగచైతన్య దగ్గర ఉంది అంటూ కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
Next Story