Sun Dec 22 2024 22:58:02 GMT+0000 (Coordinated Universal Time)
తమిళ మీడియా ముందు విజయ్ అలాంటి వాడేనని చెప్పిన సమంత
విజయ్ దేవరకొండ అలాంటి వాడు కాదు తమిళ మీడియా ముందు విజయ్
సమంత-విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సమంత-విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ బాగా సెట్ అయిందని చెబుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఆడియో సూపర్ హిట్ అవ్వగా.. ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. శివ నిర్వాణ.. నాగ చైతన్య, సమంతలతో కలిసి 'మజిలీ' సినిమా చేశాడు. ఆ సినిమాలో ఇద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అయింది. ఖుషి సినిమాలో కూడా సమంత-విజయ్ దేవర కొండ జోడీ మ్యాజిక్ వర్కౌట్ చేస్తుందని భావిస్తున్నారు.
తమిళ మీడియాతో ముచ్చటించిన సమంత విజయ్ దేవరకొండ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. విజయ్ దేవరకొండకు ఆమె మిస్టర్ పర్ఫెక్ట్ అని సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. అందరూ అనుకుంటున్నట్లు విజయ్ దేవరకొండ రౌడీ, రెబల్ కాదని ఆమె చెప్పడం విశేషం. విజయ్ దేవరకొండను రౌడీ ఫెలో అని పిలుస్తుంటే నేను చాలా రెబల్ అనుకున్నాను. నిజం చెప్పాలంటే విజయ్ దేవరకొండ చాలా మంచి వ్యక్తి. అతనికి ఒక్క చెడ్డ అలవాటు లేదు. ప్రతిరోజూ వ్యాయామం చేస్తాడు. వర్క్ పట్ల నిబద్ధతగా ఉంటాడు. విజయ్ దేవరకొండ గురించి తెలిశాక నా అభిప్రాయం మారిపోయిందని చెప్పేసింది సమంత.
Next Story