Mon Dec 23 2024 10:47:23 GMT+0000 (Coordinated Universal Time)
తన ఆరోగ్యంపై ఎమోషనల్ పోస్టు పెట్టిన సమంత.. ఎంత కష్టం వచ్చిందో..!
సమంత తన ఆరోగ్యానికి సంబంధించి కీలక విషయాలను తన అభిమానులతో పంచుకుంది. తాను అరుదైన 'మయోసైటిస్' అనే వ్యాధితో బాధపడుతున్నానని ఆమె తెలిపింది. కొన్ని నెలల నుంచి ఈ వ్యాధికి ఆటో ఇమ్యూనిటీ కండిషన్ చికిత్స తీసుకుంటున్నానని చెప్పింది. తన తాజా చిత్రం 'యశోద'కు సమంత డబ్బింగ్ చెప్పింది.. అప్పుడు కూడా చేతికి సెలైన్ ఉంది. ఒకవైపు చికిత్స పొందుతూనే, మరోవైపు సినిమా పూర్తి చేసేందుకు సమంత కష్టపడుతూ ఉంది. ఇప్పుడిప్పుడే తాను కోలుకుంటున్నానని... ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని సమంత తెలిపింది. పూర్తిగా కోలుకోవడానికి తాను ఊహించిన దాని కంటే ఎక్కువ కాలమే పట్టేటట్టు ఉందని చెప్పింది. తాను త్వరగానే కోలుకుంటానని డాక్టర్లు కూడా నమ్మకంతో ఉన్నారని తెలిపింది.
"కొన్ని నెలల నుంచి 'మయోసిటిస్'( కండరాల బలహీనత) అనే వ్యాధితో బాధపడుతున్నానని తెలిపింది. ఈ విషయాన్ని పూర్తిగా రికవర్ అయ్యాక మీతో చెబుదాం అనుకున్నాను. కానీ నేను అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పడుతుందని సమంత తెలిపింది. మనం ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్లలేమని ఇప్పుడు రియలైజ్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చింది. నేను త్వరలోనే కోలుకుంటానని డాక్టర్స్ కాన్ఫిడెన్స్‌గా చెబుతున్నారు." అంటూ సమంత ఎమోషనల్ పోస్టు పెట్టింది. సమంత చేతిలో యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలు ఉన్నాయి. వాటిని పూర్తీ చేయడానికి సమంత ఎంతగానో కష్టపడుతూ ఉంది. ఇలా అనారోగ్యంతో ఉన్నా కూడా చిత్ర నిర్మాతలు నష్టపోకూడదని చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని ఆమె తెలిపింది.
Next Story