Mon Dec 23 2024 10:20:40 GMT+0000 (Coordinated Universal Time)
సమంత మళ్లీ ఆస్పత్రిలో చేరిందా ? ఆమె మేనేజర్ ఏమన్నారు ?
ఈ వార్తలపై సమంత వ్యక్తిగత మేనేజర్ స్పందించారు. ప్రస్తుతం ఆమె ఇంటి వద్దే క్షేమంగా ఉందని స్పష్టం చేశారు. సమంతకు ఏమీ..
సమంత మెయిన్ లీడ్ లో ఇటీవల వచ్చిన సినిమా యశోద. బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్లు చేసి.. హిట్ కొట్టేసింది సమంత. దక్షిణాదితో పాటు ఇప్పుడు బాలీవుడ్ నూ తనదైన ముద్ర వేస్తున్న కేరళ కుట్టి.. ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆమె ఆస్పత్రిలో చేరిందన్న వార్తలు తెరపైకొచ్చాయి. సోషల్ మీడియాలో ఈ విషయంపై జోరుగా ప్రచారం జరుగుతోంది. మయోసైటిస్ అనే రుగ్మతతో బాధపడుతున్న సమంత ఆరోగ్యం క్షీణించిందని తమిళ మీడియాలోనూ వార్తలు మొదలయ్యాయి.
ఈ వార్తలపై సమంత వ్యక్తిగత మేనేజర్ స్పందించారు. ప్రస్తుతం ఆమె ఇంటి వద్దే క్షేమంగా ఉందని స్పష్టం చేశారు. సమంతకు ఏమీ కాలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇలాంటి పుకార్లు, తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరారు. కాగా.. సమంత మయోసైటిస్ కు గురైందని తెలిసిన వెంటనే చిరంజీవి, జూ.ఎన్టీఆర్ లు ఆమెకు ధైర్యం చెప్పారు. ఇక వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నాక మాజీ భర్త నాగ చైతన్యను కలుస్తుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. త్వరలోనే సమంత నటించిన శాకుంతలం పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. అలాగే విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో జతకట్టింది.
Next Story