Tue Dec 24 2024 01:51:21 GMT+0000 (Coordinated Universal Time)
డ్రెస్ పై ట్రోల్స్.. గట్టి కౌంటరిచ్చిన సమంత !
ఓ మహిళగా మహిళపై వచ్చే విమర్శల గురించి స్వతహాగా నాకు బాగా తెలుసు. మహిళలు ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నారు, వారి జాతి, విద్య,
హైదరాబాద్ : చైతన్యతో విడాకుల తర్వాత తన దృష్టంగా పూర్తిగా సినీ కెరీర్ మీదే పెట్టింది సమంత. ప్రస్తుతం అక్కడ , ఇక్కడ అన్న తేడా లేకుండా వరుస సినిమా అవకాశాలతో ఫుల్ బిజీ అయిపోయిందీ కేరళ కుట్టి. ఈ క్రమంలో సమంతపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆమె బ్లాకిష్ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని క్రిటిక్స్ చాయిస్ అవార్డుల ఫంక్షన్ కు వెళ్లింది. అవార్డు కూడా అందుకుంది. అయితే.. సమంత డ్రెస్ పై కొందరు నెటిజన్లు అభ్యంతరకర, అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. విపరీతంగా ట్రోల్ కూడా చేశారు. తాజాగా వాటన్నింటికీ కలిపి.. సమంత సోషల్ మీడియాలో గట్టి కౌంటరిచ్చింది.
" ఓ మహిళగా మహిళపై వచ్చే విమర్శల గురించి స్వతహాగా నాకు బాగా తెలుసు. మహిళలు ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నారు, వారి జాతి, విద్య, సామాజిక హోదా, లుక్స్, చర్మం రంగు వంటి వాటిని ఆధారంగా చేసుకుని మహిళలను విమర్శిస్తున్నారు. చెబుతూ పోతే ఆ లిస్టు ఇంకా ఎక్కువే ఉంటుంది. అయితే, వేసుకున్న దుస్తుల ఆధారంగా మహిళను జడ్జ్ చేయడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైపోతోంది."
"మనం ఇప్పుడు 2022లోకి వచ్చాం. ఇప్పటికైనా మహిళలను డ్రెస్సు కొలతల ఆధారంగా జడ్జ్ చేయడం మానేస్తే బాగుంటుంది. ఎదుటి వాళ్ల గురించి ఆలోచించడం మానేసి.. వారి గురించి వారు ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎవరికివారు తమ తమ అభివృద్ధిపై పోకస్ పెడితే జీవితంలో ఎదుగుతారు. మన ఆలోచనలను ఎదుటివారిపై రుద్దడం వల్ల ఎవరికీ లాభం ఉండదు. ఓ వ్యక్తిని అర్థం చేసుకోవడంలో.. వారి మనసులు తెలుసుకోవడంలో మార్పు తీసుకొద్దాం." అంటూ నొప్పి తెలియకుండా చురకలంటించింది.
Next Story