Wed Dec 25 2024 17:10:03 GMT+0000 (Coordinated Universal Time)
తన చావు గురించి నెటిజన్ తో ఏకీభవించిన సమంత
సమంత తన పెట్స్ కుక్కలు, పిల్లులతో ఆమె ఒంటరిగా చనిపోవాలి అంటూ
సమంత.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. దేశ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీని సంపాదించింది. సమంత ఎప్పుడూ తన కుక్కలతో ఆడుకుంటూ ఉండే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది. ఆమె అభిమానులు కూడా సమంత కుక్కలకు సంబంధించిన అప్డేట్స్ ను అడుగుతూ ఉంటారు. ఇక సమంత పర్సనల్ లైఫ్ లో కూడా కుక్కలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. తాజాగా సమంత చావు గురించి ఓ నెటిజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. ఆ వ్యాఖ్యలతో సమంత ఏకీభవించింది.
తాజాగా ఇటీవల తన కుక్కలతో ఉన్న ఓ ఫోటోని సమంత షేర్ చేయగా ఓ నెటిజన్ ఆ ఫోటోకి స్పందిస్తూ.. సమంత తన పెట్స్ కుక్కలు, పిల్లులతో ఆమె ఒంటరిగా చనిపోవాలి అంటూ కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ చూసిన ఆమె అభిమానులు అతడిని ఏకి పారేస్తూ ఉండగా.. సమంతా మాత్రం అతడితో ఏకీభవిస్తూ కామెంట్ పెట్టింది. అతను చేసిన కామెంట్ కి అలా జరిగితే అంతకన్నా అదృష్టం ఉండదు అని రిప్లై ఇచ్చింది. సమంత తన కుక్కలతో ఒంటరిగా చనిపోతే అదృష్టవంతురాలు అని భావిస్తోంది. అయితే తర్వాత అతను ఆ ట్వీట్ ని డిలీట్ చేశాడు.
సమంత గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. భర్త నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ఆమె ప్రకటించడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి కపుల్ విడిపోవడాన్ని కొందరు అసలు జీర్ణించుకోలేకపోయారు. సమంత ప్రస్తుతం సౌత్ పరిశ్రమలో అత్యధిక పారితోషికం, అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరు. ఆమె బాలీవుడ్ సినీ ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంటోంది. పుష్ప సినిమా సాంగ్ తోనూ, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తోనూ సమంత ఊహించని ఫాలోయింగ్ ను బాలీవుడ్ లో అందుకుంది. ఇప్పుడు ఆమె ముందు ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వరుణ్ ధావన్ నటిస్తున్న సిటాడెల్ లో ఆమె కనిపించనుంది. ఆమె తెలుగులో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఖుషి చిత్రంలో కూడా భాగంగా ఉంది. సమంత తన చుట్టూ ఉన్న ప్రతికూలతను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మరింత ఉన్నతంగా ఎదగాలని నిర్ణయించుకుంది. తన వర్కవుట్ లను షేర్ చేస్తూ అభిమానులు కూడా ఫిట్ గా ఉండాలని ఆమె కోరుకుంటూ ఉంటుంది.
Next Story