Mon Dec 23 2024 06:12:41 GMT+0000 (Coordinated Universal Time)
వాళ్లిద్దరి డేటింగ్ పై స్పందించిన సమంత.. ఆ అమ్మాయైనా బాగుండాలని ఆకాంక్ష
తాజాగా కూడా మరో ఫొటో వెలుగులోకి వచ్చింది. ఓ రెస్టారెంట్ లో శోభిత టేబుల్ వద్ద కూర్చోగా, దానికి ముందు చెఫ్ తో కలసి..
ఏమాయ చేశావె తో మొదలైన వారి స్నేహం.. ప్రేమకు దారి తీసి, పెళ్లి చేసుకునేంత వరకూ వెళ్లింది. నాలుగేళ్ల వైవాహిక జీవితానికి విడాకులతో స్వస్తిపలికింది ఆ జంట. వారే నాగచైతన్య, సమంత. 2017 అక్టోబర్ లో వివాహం చేసుకున్న వీరు.. 2021లో పరస్పర అంగీకారంతో తమ వైవాహిక జీవితానికి శుభం కార్డు వేసేశారు. ఇప్పుడు ఎవరి మార్గాల్లో వారు బ్రతుకుతున్నారు. అయితే ఇటీవల కాలంలో చైతన్య - శోభిత ధూళిపాళ్లతో కలిసి డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పలు సందర్భాల్లో వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలు అందుకు బలం చేకూర్చాయి.
తాజాగా కూడా మరో ఫొటో వెలుగులోకి వచ్చింది. ఓ రెస్టారెంట్ లో శోభిత టేబుల్ వద్ద కూర్చోగా, దానికి ముందు చెఫ్ తో కలసి నాగ చైతన్య ఫొటోకి ఫోజిచ్చాడు. లండన్ పర్యటన సందర్భంగా ఈ ఫొటో తీసినట్టు నెటిజన్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఓ వార్తా సంస్థతో మాట్లాడగా.. వారిద్దరి డేటింగ్ ప్రస్తావన వచ్చింది. దానిపై సమంత చాలా హుందాగా స్పందించింది. ‘‘ఎవరు ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నారనేది నేను పట్టించుకోను. ప్రేమ విలువ తెలియని వారికి ఎంత మందితో డేట్ చేసినా, చివరికి మిగిలేది కన్నీరే. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తన ప్రవర్తన మార్చుకుని, అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది’’ అని తెలిపింది.
Next Story