Sun Dec 22 2024 22:57:13 GMT+0000 (Coordinated Universal Time)
సమంత ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలే
చిత్ర పరిశ్రమలో భారీ పాపులారిటీ ఉన్న నటి సమంతా రూత్ ప్రభు. ఆమె చేసే సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు.
చిత్ర పరిశ్రమలో భారీ పాపులారిటీ ఉన్న నటి సమంతా రూత్ ప్రభు. ఆమె చేసే సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే సామ్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. సమంత తన కమిట్మెంట్లను పూర్తీ చేసి.. సినిమాలకు దూరమవ్వాలని అనుకుంటూ ఉందట..! సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ వ్యాధి నుంచి ఆమె కోలుకుంది. అయితే ఆమె తీసుకునే బ్రేక్ సమయంలో తన ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టిని సారించనుంది. దాదాపు ఒక సంవత్సరం సమంతా సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంది.
విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఖుషి' సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. 'సిటాడెల్' కూడా పూర్తయితే ఆమె తన కమిట్ మెంట్ల నుంచి దూరమైనట్లే..! ఇవి కాకుండా టాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ కొత్తగా ఆమె ఏ ప్రాజెక్టులపై సంతకం చేయలేదు. కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. గతంలో తీసుకున్న అడ్వాన్సులను కూడా ఆమె నిర్మాతలకు తిరిగి ఇచ్చేసిందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఖుషీ సినిమా 1 సెప్టెంబర్ 2023 న దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది. సిటాడెల్ ఇండియా సెప్టెంబర్ 2023లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
సెర్బియాలో వరుణ్ ధావన్తో కలిసి సిటాడెల్ చివరి షెడ్యూల్ను ముగించిన తర్వాత, సమంత ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాకు షూటింగ్ చేస్తోంది. ఇంకొద్ది రోజుల్లో సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ పూర్తవుతుంది.
Next Story