Sun Dec 14 2025 10:06:49 GMT+0000 (Coordinated Universal Time)
సమంతా నువ్వు ప్రెగ్నెంటా ? కాకపోతే నిన్ను ప్రెగ్నెంట్ చేస్తా!
సమంత అభిమానులు, నెటిజన్లు తాము అడగాలనుకున్న ప్రశ్నలు కామెంట్ చేస్తుండగా.. వాటిలో ఒక కామెంట్ ఇలా ఉంది. "సమంతా నువ్వు..

నాగచైతన్యతో విడాకుల తర్వాత.. సమంత తన పర్సనల్ లైఫ్ లో ఫుల్ బిజీ అయిపోయింది. వచ్చిన ఆఫర్ కు నో చెప్పకుండా.. వరుస చిత్రాల్లో నటిస్తూ.. మోస్ట్ బిజీ హీరోయిన్ అయింది సమంత. ఖాళీ దొరికితే ఫ్రెండ్స్ తో కలిసి టూర్లు వెసేస్తోంది. మరికొన్ని సందర్భాల్లో ఇన్ స్టా లైవ్ పెట్టి.. నెటిజన్లతో కాసేపు కబుర్లు చెప్తోంది. రీసెంట్ గా సమంత ఇన్ స్టా లో క్వశ్చన్ అవర్ పేరుతో లైవ్ కి వచ్చింది. ఎవరు ఎలాంటి ప్రశ్నలడిగినా సమాధానమిస్తాను.. అడగండి అంటూ లైవ్ నిర్వహించింది.
Also Read : వివేకా హత్య కేసు.. పులివెందుల నుంచి కడపకు బదిలీ
సమంత అభిమానులు, నెటిజన్లు తాము అడగాలనుకున్న ప్రశ్నలు కామెంట్ చేస్తుండగా.. వాటిలో ఒక కామెంట్ ఇలా ఉంది. "సమంతా నువ్వు ప్రెగ్నెంటా ? నువ్వు ప్రెగ్నెంట్ కాకపోతే నేను నిన్ను ప్రెగ్నెంట్ చేస్తా." అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ నెటిజన్ కు సమంత దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. ముందు నువ్వు రీ ప్రొడ్యూస్ అంటే ఏంటో తెలుసుకో. తెలియకపోతే గూగుల్ ద్వారా తెలుసుకో. అంతేకాదు ఈ పదాలను ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో కూడా తెలుసుకో అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సమంత. సమంత ఇచ్చిన రిప్లై కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
News Summary - Samantha Ruth Prabhu Strong Counter to Netizen about her pregnancy Rumers
Next Story

