Sun Dec 22 2024 22:19:01 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరి రిలేషన్ షిప్ గురించీ నేను మాట్లాడలేదు : సమంత
ఓ పత్రికతో సమంత మాట్లాడిన సందర్భంలో.. చై-శోభిత ల డేటింగ్ పై స్పందించినట్లు ఈరోజు ఉదయం నుంచీ వార్తలొచ్చాయి. సమంత స్పందనపై..
నాగచైతన్య తో సమంత విడాకుల తర్వాత.. చైతన్య నటి శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నారంటూ చాలాకాలంగా రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఆ రూమర్స్ కు ఆద్యం పోస్తున్నాయన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సమంత ఓ మీడియాతో మాట్లాడుతూ.. చైతన్య, శోభిత ధూళిపాళ్ల రిలేషన్ షిప్ పై స్పందించిందంటూ వార్తలొచ్చాయి. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల డేటింగ్ పై తాను స్పందించినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ నటి సమంత రుతు ప్రభు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేసింది.
ఓ పత్రికతో సమంత మాట్లాడిన సందర్భంలో.. చై-శోభిత ల డేటింగ్ పై స్పందించినట్లు ఈరోజు ఉదయం నుంచీ వార్తలొచ్చాయి. సమంత స్పందనపై గ్రేట్ ఆంధ్రాలో వచ్చిన కథనాన్ని సమంత తన ట్విట్టర్ పేజీలో ట్యాగ్ చేసింది. ‘‘నేను దీన్ని ఎప్పుడూ చెప్పలేదు’’అని స్పష్టం చేసింది. అంటే సమంత చెప్పకపోయినా.. ఆమె చెప్పినట్టుగా వార్తలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. సియాసత్ పత్రికకు సమంత ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా ఈ రోజు చాలా మీడియా సంస్థల్లో ఈ విషయంపై కథనాలు ప్రసారమయ్యాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. వాళ్ల గురించి నేను మాట్లాడలేదని సమంత పూర్తిగా క్లారిటీ ఇచ్చింది.
Next Story