Mon Dec 23 2024 12:58:21 GMT+0000 (Coordinated Universal Time)
సమంత "శాకుంతలం" అప్డేట్.. 21న ఫస్ట్ లుక్
డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. శాకుంతలంలో సమంతకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ..
టాలీవుడ్ నటి.. సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే.. ఖాళీ సమయం దొరికితే వెకేషన్లు, టూర్లు అంటూ ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ రచ్చ చేస్తోంది. ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయగా.. ఆ సాంగ్ ఒక రేంజ్ లో దుమ్ములేపింది. ప్రస్తుతం సమంత యశోద సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది.
డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. శాకుంతలంలో సమంతకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఫిబ్రవరి 21న ఉదయం 9 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. సమంత కన్ను బాలీవుడ్ పై కూడా పడింది. ఇప్పటికే అక్కడ రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. త్వరలోనే వాటి గురించి అఫీషియల్ ప్రకటన కూడా రాబోతోందని తెలుస్తోంది. హాలీవుడ్ లో కూడా సమంత ఒక మూవీ చేయబోతున్నట్లు టాక్. మొత్తానికి విడాకుల తర్వాత సమంత టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ బిజీ అయిపోతోందనమాట.
News Summary - Samantha "Sakunthalam" First Look Release on February 21st
Next Story