Sun Dec 22 2024 15:30:41 GMT+0000 (Coordinated Universal Time)
హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై సమంత సంచలన వ్యాఖ్యలు
తాజాగా అక్కడి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సమంత సినిమా గురించి, తన జీవితాన్ని గురించిన ఆసక్తికర విశేషాలను..
మయోసైటిస్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్స్ లో పాల్గొంటోంది హీరోయిన్ సమంత. ఒక పక్క షూటింగ్స్, మరో పక్క విడుదలకు రెడీగా ఉన్న సినిమాల ప్రమోషన్స్ తో బిజీగా ఉందీ సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్. తెలుగులో విజయ్ దేవరకొండతో ఖుషి, హిందీలో వరుణ్ ధావన్ తో సిటాడెల్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటూనే.. గుణశేఖర్ తీసిన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఏప్రిల్ 14న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదలకు రెడీ అవుతోంది.
హిందూ పురాణాల్లోని దుష్యంతుడు - శకుంతల కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. పాన్ ఇండియా సినిమా కావడంతో ముంబైలోనూ ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా అక్కడి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సమంత సినిమా గురించి, తన జీవితాన్ని గురించిన ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగానే సమంత హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై వ్యాఖ్యలు చేశారు. మా శ్రమ, ట్యాలెంట్ చూసి ఇంత రెమ్యునరేషన్ ఇస్తామని నిర్మాతలే చెప్పాలన్నారు. నా కష్టానికి నాకింత రెమ్యునరేషన్ కావాలని నేను అడగను..అడుక్కోవాల్సిన అవసరం కూడా లేదన్నారు సమంత. తమకు ఇచ్చే రెమ్యునరేషన్ ను బట్టే కష్టపడతామని తెలిపింది. తమ కష్టాన్ని, ట్యాలెంట్ ను గుర్తించి నిర్మాతలే రెమ్యునరేషన్ ను ఇవ్వాలన్నారు. హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై సమంత చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్, బాలీవుడ్ లలో వైరల్ అయ్యాయి.
Next Story