Mon Dec 23 2024 10:20:05 GMT+0000 (Coordinated Universal Time)
చాలా రోజులకు ఎయిర్ పోర్టులో తారసపడిన సామ్
బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని వైట్ అండ్ వైట్ డ్రెస్ లో, చేతిలో బ్యాగ్ పట్టుకొని స్టైల్ గా నడుస్తూ వెళ్లిపోయింది. ముఖానికి..
సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ సమంత..కొద్ది నెలలుగా అసలు బయటికే రావట్లేదు. యశోద ప్రమోషన్స్ కోసమైనా వస్తుందనుకుంటే.. ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చిందంతే. సమంత బయటికి రాకపోవడానికి కారణమేంటో తెలిసిందే. మయోసైటిస్ కారణంగా సమంత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైంది. ఆ వ్యాధికి ఇంటి వద్దే చికిత్స తీసుకుంటోంది. ఆమె త్వరగా కోలుకోవాలని.. అభిమానులు, ప్రేక్షకులు, ప్రముఖులు కోరుకుంటున్నారు. అంతకు ముందు వరకూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్.. మయోసైటిస్ తర్వాత అక్కడ కూడా కనిపించడం లేదు.
ఇటీవల శాకుంతలం డబ్బింగ్ స్టార్ట్ చేశానని ఓ పోస్ట్ చేసింది. తాజాగా.. ముంబై ఎయిర్ పోర్టులో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని వైట్ అండ్ వైట్ డ్రెస్ లో, చేతిలో బ్యాగ్ పట్టుకొని స్టైల్ గా నడుస్తూ వెళ్లిపోయింది. ముఖానికి మాస్క్ లేకపోవడంతో సమంతను గుర్తుపట్టిన కొందరు అభిమానులు ఫొటోల కోసం ఆమె వెంట పడ్డారు. చాలా రోజులకు డైరెక్ట్ గా కనిపించిన సమంత.. చాలా డల్ గా కనిపించింది. కొంచెం బక్కగా.. ముఖంలో కూడా కళ పోయినట్లు కనిపించింది. కాగా.. సమంత ముంబై ఎందుకు వచ్చింది. మయోసైటిస్ కు ఇంకా చికిత్స తీసుకుంటుందా ? ఈ ప్రశ్నలు అడిగిన మీడియాకు సమాధానం కూడా చెప్పకుండా వెళ్లిపోయింది.
Next Story