Mon Dec 15 2025 00:25:41 GMT+0000 (Coordinated Universal Time)
"యశోద" పై ఆసక్తి పెంచిన టీజర్.. సామ్ నటనకు ఫిదా
ఆమెను ఎవరో చంపడానికి ప్రయత్నించడం.. వాళ్ళ నుంచి సామ్ తప్పించుకోవడం.. విలన్స్ తో పోరాడటం ..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం యశోద. లేడీ ఓరియెంటెడ్ కథగా తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ విడుదలయ్యాయి. తాజాగా యశోద నుంచి టీజన్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ ను చాలా ఆసక్తి పెంచేలా కట్ చేశారు. టీజర్ లో సమంత గర్భవతిగా కనిపిస్తుంది. గర్భవతిగా ఉన్నపుడు ఏ పనులైతే చేయకూడదని డాక్టర్ చెప్తుందో.. సమంత ఆ పనులే చేస్తుంది.
ఆమెను ఎవరో చంపడానికి ప్రయత్నించడం.. వాళ్ళ నుంచి సామ్ తప్పించుకోవడం.. విలన్స్ తో పోరాడటం ఈ టీజర్ లో చూపించారు. అసలు సమంతకు ఏమైంది.? ఆమెను ఎందుకు చంపాలని ప్రయత్నిస్తున్నారు..? అన్నది తెలియాలంటే సినిమా చూడాలనిపించేలా టీజర్ ను చూపించారు. ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోండగా.. హరి–హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు.
Next Story

