సమంత నువ్వు గ్రేట్ అమ్మా..!
టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ గురించిన వార్తలు మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. తెలుగులో శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ గురించి పోరాడినప్పటికీ.. మధ్యలో సంబంధం లేని వ్యక్తులతో తగాదా పెట్టుకుని కామ్ అయ్యింది. ఇక తాజాగా బాలీవుడ్ లో తనుశ్రీ దత్త చేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలకు.. చాలామంది హీరోయిన్స్ కూడా మద్దతు తెలుపుతున్నారు. తమకి జరిగిన అన్యాయాన్ని జరిగినప్పుడు బయటపెట్టలేని వారు తనుశ్రీ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై గళమెత్తగానే ఒక్కొక్కరిగా బయటికొస్తున్నారు. తాజాగా బాలీవడ్ లో కంగనా రనౌత్ కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తుంది. ఇక నిన్నగాక మొన్న కంగనా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై సోనమ్ కపూర్ స్పందన వారిద్దరి మధ్యన వివాదానికి దారితీసింది.
మద్దతు తెలిపిన సమంత...
ప్రస్తుతం తనుశ్రీ దత్తా - నానాపటేకర్ మధ్యన జరుగుతున్న ఈ యుద్ధంలో చాలామంది పెద్దలు తనుశ్రీ వైపు నిలబడుతున్నారు. మరోపక్క కోలీవుడ్, టాలీవుడ్ సింగర్ చిన్మయి కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ పై తన గళాన్ని వినిపించింది. కేసులు, ప్రతి కేసులతో బాలీవుడ్ లో హాట్ హాట్ గా జరుగుతున్నా చర్చలకు టాలీవుడ్ నుండి కూడా మద్దతు మొదలైంది. తనుశ్రీ చేస్తున్న 'మీటూ' పోరాటానికి మద్దతు పలుకుతున్న వారిలో చాలామంది పెద్ద హీరోయిన్స్ ఉండడం గమనార్హం. తాజాగా ఈ 'మీటూ'కి తన మద్దతు తెలియజేసింది టాలీవుడ్ హాట్ అండ్ టాప్ హీరోయిన్ సమంత. 'మీటూ'పై సమంత స్పందన ఏమిటంటే... చాలా అంటే చాలా సంతోషంగా ఉంది… మహిళలు ధైర్యాన్ని కూడదీసుకుని తాము ఎదుర్కొన్న ఘటనల గురించి, లైంగిక వేధింపుల గురించి చెప్తున్నారు.
సమంత ఒక్కరేనా..?
వాళ్ల ధైర్యాన్ని మెచ్చుకుని తీరాలి. కొంతమంది వ్యక్తులు, కొందరు మహిళలు కూడా మీటూ గురించి మాట్లాడుతున్న మహిళలను నిలదీస్తున్నారు. ఆధారాలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. ఇది సిగ్గుచేటు. ‘మీటూ’ గురించి మాట్లాడుతున్న మహిళలు తాము ఎంతోమంది జీవితాలను కాపాడుతున్నారని తెలుసుకోండి ‘మీటూ ఇండియా’కి నేను మద్దతు ఇస్తున్నా.. అంటూ సమంత మొదటగా ఈ మీటూకి మద్దతు పలికింది. మరి కేవలం సమంత నే కాదు.. మిగతా టాప్ రేంజ్ హీరోయిన్స్ కూడా ఇలాంటి వాటికి మద్దతు పలకడం చాలా అవసరం. ఎందుకంటే చాలామంది చిన్న, పెద్ద హీరోయిన్స్ ఈ క్యాస్టింగ్ కౌచ్ కి బలైనవారు ఉన్నారు.