Mon Dec 23 2024 10:18:53 GMT+0000 (Coordinated Universal Time)
సమంతకు ఇంకా నయంకాలేదు.. హైపర్ బారిక్ చికిత్స తీసుకుంటోన్న సామ్
ఇప్పుడు కాస్త కోలుకోవడంతో నెమ్మదిగా షూటింగులకు హాజరవుతోంది. అయితే సమంత ఇప్పటికీ కూడా మయోసైటిస్ కు చికిత్స..
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు ఇటీవల తాను మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. ఆ వ్యాధికి చికిత్స కోసమై కొంతకాలం పాటు షూటింగ్ లకు పూర్తిగా దూరమైంది. ఇప్పుడు కాస్త కోలుకోవడంతో నెమ్మదిగా షూటింగులకు హాజరవుతోంది. అయితే సమంత ఇప్పటికీ కూడా మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మయోసైటిస్ కారణంగా.. కండరాల నొప్పులు తీవ్రంగా బాధిస్తాయి. శరీరమంతటా నొప్పులు ఉంటుంటాయి. దీంతో శరీంలో ఇన్ ఫ్లమ్మేషన్ పోవడానికి, ఇన్ఫెక్షన్లు తగ్గడానికి వీలుగా సమంత ప్రస్తుతం హైపర్ బారిక్ అనే ఆక్సిజన్ థెరపీ తీసుకుంటోంది. ఈ చికిత్సతో దెబ్బతిన్న కణజాలం తిరిగి కోలుకుంటుంది.
నిర్ణీత ప్రెజర్ తో కూడిన స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకోవడమే హైపర్ బారిక్ చికిత్స. సాధారణ వాయు పీడనంలో మనం తీసుకునే ఆక్సిజన్ తో పోలిస్తే, ఈ చికిత్స రూపంలో ఎక్కువ ఆక్సిజన్ ఊపిరితిత్తులకు అందుతుంది. ఇలా అదనపు ఆక్సిజన్ తీసుకోవడం వల్ల.. అది బాక్టీరియాపై పోరాడుతుంది. గ్రోత్ ఫ్యాక్టర్లు, స్టెమ్ సెల్స్ విడుదలకు ప్రేరేపిస్తుంది. దాంతో సమస్య నుంచి కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.
Next Story