Mon Dec 23 2024 08:16:29 GMT+0000 (Coordinated Universal Time)
సమంత-విజయ్ దేవరకొండ వీడియో కాల్ అంటూ మోసం చేశారా?
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సామ్, విజయ్ ప్రమోషన్స్ ను పెంచారు.
అయితే సమంత అర్దరాత్రి వీడియో కాల్లో విజయ్ దేవరకొండతో మాట్లాడింది అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. సామ్ కి కాల్ చేసి నాక్ నాక్ జోక్ చెప్దామని కాల్ చేసినట్లు తెలిపాడు. ఇక ఇందులో సమంత అర్ధరాత్రి ఒకటిన్నర అయ్యిందని, ఇప్పుడు జోక్ ఏంటి అని అడగడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే నిజంగా మాట్లాడుకుంటున్నట్టుగా ఇద్దరూ కవరింగ్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ బాగానే మేనేజ్ చేశాడు కానీ.. సమంత వైపు నుండి మాత్రం దొరికిపోయింది. ఇందులో సమంత కళ్లజోడు పెట్టుకోవడంతో అందులో అసలు విషయం బయటకు వచ్చింది. అది రికార్డ్ చేసిన వీడియో అని తెలిసిపోతోంది. వీడియో కాల్ కాదని తెలిసిపోయింది. ఇక ఇక ఈ వీడియోలో సమంత కోసం విజయ్ పాట పాడాడు. త్వరలోనే వీరిద్దరూ మరిన్ని ప్రమోషన్స్ లో భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మూవీ సమంత అనారోగ్యం వలన ఆలస్యం అయింది. ఆమెకు మయోసైటిస్ రావడంతో ఈ మూవీ షూటింగ్ కొన్ని నెలలు ఆగిపోయింది.
Next Story