Mon Dec 23 2024 07:05:15 GMT+0000 (Coordinated Universal Time)
Samantha : విడాకుల బాధ నుంచి కోలుకోవడానికి వాళ్ళు సహాయ పడ్డారు..
నేను నా అనారోగ్యం, విడాకుల బాధ నుంచి కోలుకోవడానికి వాళ్ళే నాకు సహాయ పడ్డారు అంటున్న సమంత.
Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు విరామం ఇచ్చి మయోసైటిస్ సమస్యకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సమంత ఈ అనారోగ్య సమస్య గురించి బహిరంగంగా చెప్పడడం పై పలువురు హర్షం వ్యక్తం చేస్తుంటారు. అయితే కొంతమంది దీనిని విమర్శిస్తుంటారు. ఆమె పదేపదే ఈ సమస్య గురించి మాట్లాడి సానుభూతుని కోరుకుంటుంది అంటూ పలువురు కామెంట్స్ చేస్తుంటారు.
కేవలం ఈ అనారోగ్యం సమస్య గురించి మాత్రమే కాదు, విడాకుల విషయంలో కూడా సమంత ఇలాంటి విమర్శలనే ఎదుర్కొంటున్నారు. సమంత ఈ విషయాలు గురించి ఎందుకు పదేపదే బహిరంగంగా మాట్లాడుతున్నారు..? ఇలా చేస్తూ ఆమె అభిమానులకు ఏం మెసేజ్ ఇస్తున్నారు..? అని ఆమెను ఒక మ్యాగజైన్ మీడియా ప్రశ్నించింది. ఇక ఈ ప్రశ్నలకు సమంత ఒక క్లారిటీ ఇచ్చేశారు.
సమంత కామెంట్స్..
"నా సినిమాలు ప్లాప్ అవ్వడం, మ్యారేజ్ ఫెయిల్ అవ్వడం, అనారోగ్యంతో నా వర్క్ కూడా ఎఫక్ట్ అవ్వడం, అన్నిటికి మించి నా పై వచ్చే విమర్శలు ఇవన్నీ నన్ను చాలా కృంగిపోయేలా చేశాయి. వీటి నుంచి ఎలా బయటపడాలని చాలా ఆలోచించాను. ఈ క్రమంలోనే గతంలో ఇలా నాలా బాధపడిన వారి గురించి పరిశోధన చేశా. వారి కథలను చదివాను. వారి కథలు నా సమస్యలకు ఒక పరిష్కారం అయ్యాయి.
నేను నా అనారోగ్యం, విడాకుల బాధ నుంచి కోలుకోవడానికి వాళ్ళే నాకు సహాయ పడ్డారు. మనకి ఒక స్టార్ హోదా రావడం అనేది ఒక వరం. దానిని ఒక భాద్యతగా భావించి మన కథలు అందరికి చెబితే.. అలాంటి ఎదుర్కొంటున్న వారికీ అవి సహాయ పడతాయి. నాలా బాధపడేవారు బయట చాలా మంది ఉండి ఉంటారు. వారి కోసం నేను నా సమస్యలను బహిరంగంగా మాట్లాడుతున్నాను" అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
Next Story