Tue Dec 24 2024 00:44:23 GMT+0000 (Coordinated Universal Time)
మరో అవార్డు అందుకున్న సమంత
ఓటీటీలో విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో తన అద్భుతమైన నటనను కనబరిచిన సమంతకు ఉత్తమ నటి అవార్డు లభించింది.
ఇటీవలే చైతూతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సమంత.. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తన కెరీర్ పై దృష్టి పెట్టింది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది సామ్. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లలో వచ్చిన అవకాశాలను వదులుకోకుండా.. అన్ని ఛాన్స్ లకు ఓకే చెప్పెస్తుందట. తాజాగా సమంత మరో అరుదైన అవార్డును అందుకుంది.
ఉత్తమ నటిగా...
ఓటీటీలో విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో తన అద్భుతమైన నటనను కనబరిచిన సమంత.. ఆ సినిమాకు ఉత్తమనటిగా అవార్డు అందుకుని, మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో రాజీ గా నటించిన సమంత ఫిల్మ్ ఫేర్ ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ముంబై లో జరిగిన ఈ అవార్డుల వేడుకలో సమంత పాల్గొనగా.. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. గతంలో ఏమాయ చేసావే.. ఈగ, నీతానే ఎన్ వసంతం చిత్రాలకు కూడా సమంత ఉత్తమనటిగా అవార్డులు సొంతం చేసుకుంది. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమాలో నటించగా.. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
Next Story