Mon Dec 23 2024 22:57:04 GMT+0000 (Coordinated Universal Time)
ఆద్యంతం ఆసక్తికరంగా "యశోద" ట్రైలర్
పిల్లల్ని కనలేక, కనే అవకాశం లేక అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వాలనుకునే కొందరు సెలెబ్రెటీస్ కోసం ..
సమంత మెయిన్ లీడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన సినిమా "యశోద". ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై.. అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సమంత గర్భవతిగా నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా "యశోద" ట్రైలర్ ను విజయ్ దేవరకొండ చేతులమీదుగా విడుదల చేయించింది చిత్రయూనిట్. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ట్రైలర్ ని బట్టి చూస్తే.. ఈ సినిమా సరోగసి కథాంశంతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
పిల్లల్ని కనలేక, కనే అవకాశం లేక అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వాలనుకునే కొందరు సెలెబ్రెటీస్ కోసం ఒక సంస్థ పనిచేస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే సమంత కూడా ఒక ప్రముఖ వ్యక్తి కోసం అద్దె గర్భం దాల్చుతుంది. అయితే ఆ సమయంలో అక్కడ జరిగే కొన్ని చట్ట విరుద్ధమైన పనులు సమంత కంట పడతాయి. వాటిని బయటపెట్టే క్రమంలో సమంత ఎదుర్కొన్న సన్నివేశాలను.. యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు. ట్రైలర్ చివరిలో.. యశోద అంటే ఎవరో తెలుసుగా, కృష్ణ పరమాత్ముడు తల్లి అంటూ సామ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సమంత చేసిన ఫైట్స్ అయితే సినిమాకే హైలైట్ గా నిలిచేలా ఉన్నాయి. నవంబర్ 11న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు తమిళ డైరెక్టర్స్ హరి-హరన్ లు దర్శకత్వం వహిస్తున్నారు.
Next Story