Sun Dec 22 2024 22:22:24 GMT+0000 (Coordinated Universal Time)
అక్కడ అప్పుడే లాభాల బాట పట్టిన 'యశోద'
సమంత లీడ్ రోల్ లో చేసిన సినిమా యశోద. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ దక్కింది. దేశ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన సినిమాకు కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చేశాయి. రెండంటే రెండే రోజుల్లో సినిమా లాభాల బాట పట్టింది. యశోద చిత్రం అమెరికాలో భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం ఇప్పటికే లాభాల్లోకి ప్రవేశించింది. ఈ సినిమాకు ప్రీమియర్ల రూపంలో 65k, తొలి రోజు 135k వసూళ్లను సాధించింది. రెండో రోజు ముగిసే సరికి 350k డాలర్లు అంటే 2.8 కోట్లు వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా యశోద గత రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా 7.19 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకుపైగా షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. యశోద చిత్రం దేశవ్యాప్తంగా సుమారు 4.13 కోట్ల వసూళ్లు సాధించింది. తెలుగులో 3.6 కోట్లు, హిందీలో 14 లక్షలు, తమిళంలో 39 లక్షలు వసూలు చేసింది. తొలి రోజు కంటే రెండో రోజు బాక్సాఫీస్ వద్ద 35 శాతం వృద్ధిని సాధించింది. యశోద ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ 50 శాతం, బెంగళూరులో 40 శాతం, చెన్నైలో 90 శాతం, విజయవాడ, వరంగల్, గుంటూరు, వైజాగ్, నిజమాబాద్లో 40 శాతం వరకు, ఢిల్లీలో 30 శాతం, కాకినాడలో 99 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మిగితా ప్రధాన ప్రాంతాల్లో 35 శాతం నుంచి 55 శాతం వరకు ఆక్యుపెన్సీ రికార్డు అయింది. రెండో రోజు ఫస్ట్, సెకండ్ షోలకు ఆక్యుపెన్సీ భారీగా పెరిగింది. ఓవరాల్గా 60 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది.
Next Story