Mon Dec 23 2024 04:26:06 GMT+0000 (Coordinated Universal Time)
'హాయ్ నాన్న' మ్యూజికల్ జర్నీ స్టార్ట్..
నాని 'హాయ్ నాన్న' మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసేశాడు. ‘సమయమా’ అంటూ..
'దసరా' వంటి మాస్ హిట్ అందుకున్న తరువాత నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న సినిమా ‘హాయ్ నాన్న’. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు చిత్ర యూనిట్. మూవీలోని సాంగ్స్ ని ఒక్కోటిగా ప్రేక్షకుల ముందుగు తీసుకు రానున్నారు. ఈక్రమంలోనే నేడు మొదటి సాంగ్ ని రిలీజ్ చేశారు.
మలయాళ సంగీత దర్శకుడు 'హేశం అబ్దుల్ వహాబ్' ఈ మూవీకి మ్యూజిక్ చేస్తున్నాడు. టాలీవుడ్ కి పరిచయం చేసిన 'ఖుషి' మూవీ ఆల్బమ్ సూపర్ హిట్ అయ్యింది. దీంతో 'హాయ్ నాన్న' మ్యూజిక్ ఆల్బమ్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే హేశం అబ్దుల్.. మొదటి సాంగ్ ని అదరగొట్టేశాడు. ‘సమయమా’ అంటూ సాగే సాంగ్ మెలోడీతో బాగుంది.
అనంత్ శ్రీరామ్ ఈ పాటకి లిరిక్స్ అందించాడు. అనురాగ్ కులకర్ణి, సితార కృష్ణకుమార్ ఈ పాటని పాడారు. కాగా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సాంగ్ ని నాని అండ్ మృణాల్ పై చాలా అందంగా చిత్రీకరించారు. ఇద్దరి లుక్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండడంతో తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళ, హిందీ లాంగ్వేజ్స్ లో కూడా సాంగ్ ని రిలీజ్ చేశారు. మరి ఆ సాంగ్ ని ఒకసారి మీరుకూడా వినేయండి.
కాగా ఈ మూవీలో నాని మరోసారి తండ్రి పాత్ర చేస్తున్నాడు. గతంలో 'జెర్సీ' సినిమా ఫాదర్ రోల్ చేసి అందర్నీ ఎమోషనల్ చేసిన నాని.. మళ్ళీ ఈ సినిమాలో తండ్రిగా నటిస్తుండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో 'శృతిహాసన్' కూడా ఒక ముఖ్య పాత్రలో నటించబోతుంది అంటూ సమాచారం.
Next Story